BJP Leader condemns UP police action against Priyanka ప్రియంక పట్ల యూపీ పోలీసుల తీరును ఖండించిన బీజేపి నేత

Maharashtra bjp leader demands strict action against male cop who manhandled priyanka gandhi

Hathras, Rahul Gandhi, priyanka gandhi, Chitra Wagh, male cop, strict action, Hathras gangrape, Uttar Pradesh, UP Police, Hathras Rape Case, Hathras Rape, Rahul Gandhi pushing image, rahul gandhi picture, priyanka gandhi picture, Hathras Rape Case, Yamuna Express Highway, Uttar pradesh, Politics

Maharashtra BJP vice president Chitra Wagh demanded Uttar Pradesh Chief Minister Yogi Adityanath to take 'strict action' against a policeman who held Congress leader Priyanka Gandhi Vadra by her clothes when a scuffle broke out between party supporters and state police at Delhi-UP border on Saturday.

ప్రియంక గాంధీ పట్ల యూపీ పోలీసుల తీరును ఖండించిన బీజేపి నేత

Posted: 10/05/2020 07:20 PM IST
Maharashtra bjp leader demands strict action against male cop who manhandled priyanka gandhi

(Image source from: Twitter.com/ChitraKWagh)

ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ బాధిత దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలపై అక్కడి పోలీసులు టార్గెట్ చేసుకని రాహుల్ ను కిందపడేలా తోసివేయడం.. ప్రియాంక ధరించిన వస్త్రాలను టార్గెట్ గా చేసుకోవడం కనిపించింది. ఇది పోలీసులు కావాలని చేసిన అవమానంలా వున్నాయి. జాతీయ నేతలను టార్గెట్ చేసుకుని ఇలాంటి ఘటనలు జరగడం.. ఇందుకు పోలీసులను కావాలని ఫురిగొల్పినట్టు వుంది. అయితే ఈ విధంగా పోలీసులకు అదేశాలు ఇచ్చింది ఎవరన్న ప్రశ్నలు కాంగ్రెస్ అభిమానులను నుంచి వ్యక్తం అవుతున్నాయి.

హాత్రాస్ బాదితులను పరామర్శించేందుకు వచ్చిన ప్రియాంక గాందీని రెండు పర్యాయాలు అమె వస్త్రాలను టార్గెట్ చేసుకున్న ఘటనలు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య జనంలోనూ ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. తొలిసారి వెళ్లిన సంధర్భంలో అమె వస్త్రాలను మహిళా పోలీసులు టార్గెట్ చేయగా, రెండో పర్యాయం ఏకంగా మగ పోలీసులే అమె వస్త్రాలను పట్టుకోవడం ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల వ్యవహార తీరును.. వారిని అలా ప్రేరేపిస్తున్న వారి తీరును ప్రదర్శింపజేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శలు సంధిస్తున్నారు. హాత్రాస్ ఘటనలో దళిత యువతిపై అగ్రవర్ణాలకు చెందిన పలువురు నిందితులు సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పోందుతూ అమె మరణించడంతో పోలీసులే అమె మృతదేహాన్ని దహనం చేయడాన్ని బాధితరాలి కుటుంబసభ్యులు కూడా తప్పుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పోలీసులు అగ్రనేతలపై అత్యంత జుగుప్సాకర రీతితో వ్వవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులతో పాటు తాజాగా బీజేపి పార్టీకి చెందిన నాయకురాలు కూడా పోలీసుల తీరును తప్పబట్టారు. మహారాష్ట్ర బీజేపి ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాఘ్ పోలీసులు దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఏ దారుణాన్ని వ్యతిరేకిస్తూ ప్రియాంకాగాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించారో అదే తరహాలో అమెపై పోలీసులు విరుచుకుపడటం క్షమార్హం కాదని దుయ్యబట్టారు. ప్రియాంక చేతిని పట్టుకుని ఓ పోలీసు ఆమెను ముందుకు రాకుండా నిలువరించడంపై అమె మండిపడ్డారు.

మహిళా నాయకురాలి దుస్తులపై అలా చేయి వేయడానికి ఆ మగ పోలీసుకి ఎంత ధైర్యం? అంటూ ఆమె నిలదీశారు. ఇది క్షమించరాని నేరంగా పరిగణించాల్సిందేనని అమె అన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై విశ్వాసం కలిగిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై తీవ్రంగా స్పందించాలని ఆమె కోరారు. సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ పరిమితులు తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. కాగా ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ప్రియాంకాగాంధీకి ఇవాళ క్షమాఫణలు చెప్పారు. అమె పట్ల పోలిస్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై దర్యాప్తుకు కూడా అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles