CBI registers case against DK Shivakumar కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ ఇంటిపై సీబిఐ దాడులు

Cbi raids congresss dk shivakumars premises in alleged corruption case

DK Shivakumar, Congress, AICC, disproportionate Assets, karnataka congress, Rajya Sabha, Eagleton Golf Resort, Central Bureau of Investigation, Karnataka, crime

The CBI is carrying out searches on the premises belonging to Congress leader D K Shivakumar in connection with an alleged corruption case. The agency has booked Shivakumar and others on the allegations of acquisition of disproportionate Assets. Searches are being conducted today at 14 locations including 9 in Karnataka, 4 in Delhi, one in Mumbai.

ఉపఎన్నిక వేళ: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ ఇంటిపై సీబిఐ దాడులు

Posted: 10/05/2020 08:32 PM IST
Cbi raids congresss dk shivakumars premises in alleged corruption case

(Image source from: Deccanherald.com)

కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసం సహా 14 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం అకస్మికంగా సీబిఐ అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసి తాము గెలవాలని బీజేపి ప్రయత్నిస్తూ.. ఈ మేరకు ప్రజల దృష్టిని మరల్చడానికి దాడులను నిర్వహిస్తుందన్న విమర్శల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్ చెందిన ఢిల్లీ, ముంబై సహా కర్ణాటకలోని మొత్తం 14 ప్రాంతాల్లో దాడులు సీబిఐ అధికారులు దాడులు చేశారు. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహాన్ని అదిలోనే నిరుత్సాహప పర్చేందుకు ఈ దాడులు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ దాడుల్లో బీజేపి ప్రభుత్వంపై వున్న వ్యతిరేకతను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. రాజకీయాల్లో ఎన్నడూ ఏ పార్టీ ఇంతటి నీచ రాజకీయాలకు పాల్పడలేదని, ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోనే ధైర్యం లేక కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీ.. తమ చేతిలో వున్న అధికారంతో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కక్ష సాధింపు రాజకీయాల కోసం వినియోగిస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. కాగా శివకుమార్ కు చెందిన 14 ప్రాంతాల్లో దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దాదాపు 60 మందికి పైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొని శివకుమార్ సోదరుడు సురేశ్ నివాసాలు, ఆయన కార్యాలయాల్లోనూ దాడులు జరిపారు.

ప్రధాని నరేంద్రమోడీ మోదీ, సీఎం యడియూరప్ప చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారారని, ఆయన చెప్పిన 56 ఇంచుల ఛాతి ఎక్కడికి పోయిందో కానీ.. దొంగ మార్గాల ద్వారా.. ప్రజల దృష్టిని మరల్చి.. అధికారాన్ని కొనసాగించాలనే అలోచనలు ఈ దాడులు దర్పణం పడుతున్నాయని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా. ప్రధాని, యడ్డ్యూరప్పల ఆదేశాలతోనే దాడులకు దిగారని  తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఇటువంటి చర్యలకు దిగుతోందని మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు.ఇటువంటి చర్యలతో తమను భయాందోళనలకు గురిచేయలేరని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles