SP Balasubrahmanyam's funeral: Veteran singer laid to rest at his farmhouse అశ్రనయనాల మధ్య ముగిసిన ఎస్పీ బాలు అంత్యక్రియలు

Sp balasubrahmanyams funeral veteran singer laid to rest at his farmhouse

SPB dead, Balasubrahmanyam death, SP Balasubrahmanyam dead, singer Balasubrahmanyam, SP balasubrahmanyam hindi songs list, SP balasubrahmanyam, SP Sailaja, SP balasubramaniyaam songs list, SP balasubramaniam songs, MGM Hosiptal, coronavirus, covid-19, sp Balasubrahmanyam, SPB, Balu, Singer Balu, MGM Hospital, SP Charan, Last rites, Red Hills, Thamaraipakkam, SPB Farm House, Chennai, Tamil Nadu

Legendary playback singer S.P. Balasubrahmanyam - SPB to his legions of fans - was laid to rest with full state honours on Saturday, amidst an outpouring of grief from fans across the world and his tinsel town peers.

అశ్రనయనాల మధ్య ముగిసిన ఎస్పీ బాలు అంత్యక్రియలు

Posted: 09/26/2020 06:10 PM IST
Sp balasubrahmanyams funeral veteran singer laid to rest at his farmhouse

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య.. చెన్నై శివార్లలోని ఆయనకు చెందిన ఫాంహౌజ్ లోనే పూర్తయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో బాలు అంత్యక్రియలను జరిపింది. బాలు తనయుడు ఎస్సీ చరణ్ తండ్రికి చేయాల్సిన క్రతువులు నిర్వహించారు. బాలు భార్య సావిత్రమ్మ, కుమార్తె పల్లవి, సోదరి శైలజ సహా కుటుంబీకులు సమక్షంలో బాలు పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఎస్పీ బాలు నివాసంలో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో జిల్లా కలక్టర్ అదేశాల నేపథ్యంలో నిన్న రాత్రే బాలు పార్థీవదేహాన్ని చెన్నై శివారులోని తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ ఫాంహౌజ్ కు తరలించారు.

ఇక ఇవాళ ఉదయం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎస్పీ బాలు అంతిమ సంస్కారాలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరై నివాళులర్పించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు వచ్చారు. అయితే తామరైపాక్కంలోని బాలు ఫామ్ హౌజ్ లోకి అధికారులు పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్‌, మనో, శుభలేక సుధాకర్, కన్నడ నటుడు అర్జున్, తమిళనటులు విజయ్ తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles