Heavy rains continue to lash in Telangana districts హైదరాబాదులో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతలు జలమయం..

Heavy rains lash hyderabad other parts of telangana

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

Heavy rains have been lashing the city and suburbs since Friday late night. Starting as a light drizzle on Friday evening, the rains picked pace in the night and intensified to continue as heavy rains on Saturday morning. Till 7 am, Hayathnagar recorded a very heavy rainfall of 131 mm, followed by Bandlaguda (91 mm), Saroornagar (88.5 mm), Vanasthalipuram (87.8) and Charminar (87 mm).

హైదరాబాదులో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతలు జలమయం..

Posted: 09/26/2020 05:25 PM IST
Heavy rains lash hyderabad other parts of telangana

(Image source from: Siasat.com)

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి, చిన్న వాగులు వంకలు కూడా ప్రవహిస్తూన్నాయి. కుంటలు, చెరువులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇక వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కక్షగట్టి కుండపోత వర్షాలను కురిపిస్తున్నాడా.? అన్నట్లు.. గత రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనికి తోడు ఇవాళ ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూనే వుంది, అటు వాతావరణ శాఖ అధికారులు ఇవాళ కూడ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని సూచించారు.

హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షంతో రోడ్ల జలపాతాల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఇవాళ్టి ఉదయం వరకు నగరంలో సగటున 7 సెంటీమీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలోని బండ్లగూడలో 91ఎంఎం, సరూర్ నగర్ లో 88.5ఎంఎం, వనస్థలిపురంలో 87.8, చార్మినార్ పరిధిలో 87 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, రంగారెడ్డి జిల్లాలో సగటున 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరూర్ నగర్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా చెరువుకు వెళ్లే ప్రధాన రహదారిపైకి రెండున్నర అడుగుల మేర నీరు చేరింది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్, సూర్యాపేట, వరంగల్ రూరల్, వికారబాద్, జనగాం, సిద్దిపేట, మహబూభ్ నగర్ జిల్లాల్లోనూ గత రాత్రి నుంచి వర్షం కురుస్తోంది, ఇక దీనికితోడు హైదరాబాద్ నగరంలో రానున్న మూడు రోజుల వ్యవధిలో పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరవాసులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. వర్షం పడుతున్న సమయంలో ఎవరు చెట్ల కింద ఆసరాగా చేసుకుని వుండారదని సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానిపై ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు వాగులు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ పరిధిలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. కడప నగరంలోకి వరద నీరు చేరింది. బద్వేలు, పోరుమామిళ్ల, నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ, అనంతపురం తదితర ప్రాంతాల్లో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చెరువు గట్లు తెగి, నీరు ఇళ్లలోకి చేరినట్టు సమాచారం. కోస్తాంధ్రలోని అన్ని చోట్లా ఓ మోస్తరు నుంచి, భారీ వర్షం కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles