HC issues stay on SIT Investigation on Amaravati వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ..

Andhra high court issues stay on sit investigation on amaravati land irregularities

Amaravati, Lands, AP High Court, Special Investigation Team, SIT Investigation, Amaravati Lands, Jagan government, Kolli Raghuramireddy, Andhra Pradesh

Andhra Pradesh High Court granted stay on setting up of SIT on Amaravati Lands. The court has issued interim orders without further action on the formation of the cabinet sub-committee. It ordered that no inquiries be made until further orders.

అమరావతి భూములపై సిట్ విచారణకు బ్రేక్.. స్టే విధించిన హైకోర్టు

Posted: 09/17/2020 02:42 AM IST
Andhra high court issues stay on sit investigation on amaravati land irregularities

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాదు ఈ వ్యవహారంలో ఎలాంటి ముందస్తు విచారణలు చేపట్టకూడదని పేర్కోంటూ న్యాయస్థానం ప్రభుత్వం సిట్ విచారణపై స్టే విధించింది. ఈ విషయంలో న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తమ అదేశాలను అమలు చేయాలని పేర్కోంది. అమరావతి రాజధానిగా ప్రకటించే నేపథ్యంలో ఈ ప్రాంతలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగిందని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది.

దీంతో క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలోని పది మంది సభ్యులతో కలసి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. దీంతో టీడీపి నేతలు వర్ల రామయ్య, రాజాలు రాష్ట్ర హకోర్టులో సిట్ ఏర్పాటు, దర్యాప్తుపై పిటీషన్ దాఖలు చేశారు. సిట్ ఏర్పాటు చట్టవిరుద్దమని పేర్కోన్నారు. ఒక దురుద్దేశంతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతోందని తమ పిటిషన్ లో వారు ఆరోపించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని వారు ఈ సందర్భంగా కోర్టులో వాదించారు.

దీంతో ఈ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అంతేకాదు ఈ కేసులో సిట్ దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని భూములపై దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేయాలని సదరు సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు. తమ ప్రభుత్వ నిర్ణయాలపై అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం పునఃసమీక్షించడంపై కేవలం కక్షపూరిత వ్యవహారమని.. గత ప్రభుత్వం తప్ప చేసిందని, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని ఓ ప్రణాళికా బద్దంగా కుట్ర జరుగుతోందని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో స్టే విధించిన న్యాయస్థానం సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles