Net cash of over Rs 3.75 cr seized in Hyderabad కారులో కట్టల పాములు.. రూ.3.75లక్షలు స్వాధీనం

Bundles of huge hawala money tumble out of car in banjara hills

hawala cash, Kamlesh Shah, Ahmedabad, P Vijay & Company, Eshwar Dileepji Solanki, hyderabad police, Police commissioner, Anjani Kumar, Telangana, Crime

Unaccounted cash worth Rs 3.75 crore was seized by the Hyderabad police Tuesday after cops found four men transporting the amount in two cars near Banjara Hills. Based on a tip off, the police nabbed the four persons who could not produce valid documents to reveal the source of cash.

కారులో కట్టల పాములు.. రూ.3.75లక్షలు స్వాధీనం

Posted: 09/16/2020 01:16 AM IST
Bundles of huge hawala money tumble out of car in banjara hills

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హవాల నిర్వహించి కోట్ల రూపాయల డబ్బును తీసుకెళ్లున్న ఓ ముఠా గుట్టను పోలీసులు రట్టు చేశారు. నగరంలోని బంజారాహిల్స్ లో అక్రమంగా డబ్బును తరలిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు వారి నుంచి కట్టలకొద్ది నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. రెండు కార్లలో వెళ్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3.75కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

హవాల వ్యవహారానికి సంబంధించిన డబ్బుల కట్టలను చూసి పోలీసులే నివ్వెరపోయారు. కాగా, ఈ అక్రమ డబ్బు రవాణాకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌ మీడియాకు వెల్లడిస్తూ.. ముంబయి కేంద్రంగా నిర్వహించే పి. విజయ్ అండ్ కంపెనీ సంస్థకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌ 12లో శాఖ ఉంది. ఆ శాఖకు గిరి, రాఠోడ్ అనే వ్యక్తులు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ముంబైలోని అదే కంపెనీ ప్రధాన శాఖలో పని చేసే దిలీప్, హరీష్ హైదరాబాద్‌ వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం ఈ నలుగురూ కారులో డబ్బును తరలిస్తున్నారని పక్కా సమాచారం పోలీసులకు అందింది.

దీంతో అక్రమంగా డబ్బును రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రోడ్డుపై పికెట్ నిర్వహించారు. తమకు అందిన సమాచారం మేరకు వచ్చిన రెండు వాహనాలను ఆపారు. అయితే ఓ కారులో ఏమీ లభ్యం కాకపోవడంతో దానిని వదిలిపెట్టి.. రెండో కారులో తనిఖీ చేయగా కట్టల కోద్దీ నగదు బయటపడింది. నగదుకు సంబంధించి లెక్కలు చూపించకపోవడంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles