HC asks govt to give clear instructions on conducting exams పైనల్ సెమిస్టర్ పరీక్షలకు బెల్ మ్రోగించిన హైకోర్టు

Telangana hc asks govt to give clear instructions on conducting university exams

High Court, Final semester, Universities, Btech, Degree, Advocate General, Banda Shivananda Prasad, C Damodar Reddy, Chief Justice Raghavendra Singh, Telangana

Telangana High Court asked the government to give clear instructions to the Universitys on conducting Final Semister exams. 'Those who are not interested in taking exams can stay back. The state government has assured advanced supplementary exams will be held later and those who appear in such examinations too will be treated as regular students.' said the high court Chief Justice Raghavendra Singh.

అనుకూలమైన విధానంలో.. అన్ని జాగ్రత్తల మధ్య ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు

Posted: 09/16/2020 01:02 AM IST
Telangana hc asks govt to give clear instructions on conducting university exams

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. చివరి ఏడాది సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు గతంలో అనుసరించిన విధంగానే ఈ సారి కూడా పరీక్షలను రాయాల్సి వుంటుందని రాష్ట్రోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో చివరి ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులు తమ పరీక్షలు అన్ లైన్ లో జరుగుతాయా.? లేక పరీక్షా కేంద్రాలకు హాజరై పాత పద్దతిలోనే పరీక్షలకు హాజరుకావాలన్న అన్న మిమాంస ఎట్టకేలకు తొలగిపోయింది.

ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చివరి పరీక్షకు ఎప్పటిలాగే రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. అటానమస్‌ కళాశాలలు వారికి అనుకూలమైన విధానంలో పరీక్షలు జరుపుకోవచ్చని సూచించింది. అయితే ఈ కేసును నిన్న కూడా విచారించిన న్యాయస్థానానికి ప్రభుత్వం తరపున అటర్నీ జనరల్ కరోనా నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు సప్లిమెంటరీలో పరీక్షలను రాసుకోవచ్చేనని చెప్పారు. అందుకుగాను వారు సప్లమెంటరీలో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్ గా పాసైనట్టు పరిగణిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అయితే, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఇస్తే.. విద్యార్థులు దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారని ఎన్‌ఎస్‌యూఐ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి  కోరగా.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ఆయా శాఖలు నిర్ణయిస్తాయని, దానిపై ఇప్పుడే హామీ ఇవ్వలేమని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చిన జేఎన్‌టీయూహెచ్‌.. రెండు నెలల్లోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్షలను కరోనా జాగ్రత్తలో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవుతున్నాయి. రేపటి నుంచి జేఎన్‌టీయూహెచ్‌.. ఎల్లుండి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles