Hyderabad man blackmailed of Rs 0.75 lakh with dating lure డేటింగ్ యాప్ తో వలపు వల.. ఆపై బ్లాక్ మెయిల్..

Honey trapped with dating lure hyderabad man blackmailed of rs 0 75 lakh

Hyderabad news, Cyber Crime, Dating App, Tarun, Padmarao nagar, woman, man duped of 0.75 lakh, Honey-trapped with dating lure, dating lure Hyderabad, crime

A 26-year-old youth, a resident of Vastrapur originally from Kolkata, who is a consultant with a private company, fell into a trap set by cyber cheats, who lured him with the promise of chatting with a woman on a dating application. The cheats took Rs 4,59,415 from him before he realized he had been cheated. They had threatened to upload his identity card on social media and defame him.

డేటింగ్ యాప్ తో వలపు వల.. ఆపై బ్లాక్ మెయిల్..

Posted: 09/15/2020 12:42 AM IST
Honey trapped with dating lure hyderabad man blackmailed of rs 0 75 lakh

ఎంతవారలైనా కాంతదాసులే అన్న నానుడి అందరి విషయంలోనూ వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే మగువలు కనిపించడంతో పాటు కవ్విత్తే ఆ మత్తులో సర్వస్వం కోల్పేయేవారు కూడా వున్నారన్న విషయం కూడా తెలిసిందే. తొలుత మగువలు తమకు మంచి సంపన్నుడు, సౌమ్యుడు కనిపిస్తే వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రదర్శించే కవ్వింపులు ఇప్పుడు ఎవరో వెరెవరికోసమే పన్నిన వలలో వీరిని పావులుగా కూడా వాడుకుంటున్నారు. ఆ ఫోటోలు వీడియోల ఆధారంగా వారి నుంచి దొరికినంత దోచుకుంటున్నారు. ఇదే ఆ మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన భారీ స్కామ్ అన్న విషయం కూడా తెలిసిందే.

అక్కడి కమల్ నాథ్ ప్రభుత్వం దిగిపోవడానికి ఇది కూడా ఓ కారణమన్న పుకార్లు షికార్లు చేస్తూనే వున్నాయి. ఆ విషయాన్ని పక్కనబెడితే ఎవరో బడాబాబులను ఇలా ట్రాప్ లో పడేయడం వారితో తమకు కావాల్సిన పనులు చేయించుకోవడం పక్కనబెడితే.. ఇదే అదునుగా ఎవరు పడితే వారిని ట్రాప్ చేసి వారి నుంచి అందిన కాడికి దండుకునే ఓ ముఠా వుందన్న విషయం తాజాగా బహిర్గతం అయ్యింది. మొన్నామధ్య అహ్మదాబాద్ లో డేటింగ్ సైట్లోకి ఎంటరైన ఓ యువకుడిని కవ్వించి బ్లాక్ మెయిల్  చసిన ఐదు లక్షల రూపాయల మేర బురడీ కొట్టించిన ముఠా గుట్టు బయటపడగా, తాజాగా అలాంటిదే మరో ముఠా చేతిలో హైదరాబాద్ యువకుడు కూడా చిక్కాడు.

డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ యువతి తనను బ్లాక్ మెయిల్ చసిన అప్పనంగా డబ్బు గుంజుతూ మళ్లీ మళ్లీ వేధిస్తోందని ఓ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, పద్మారావు నగర్ కు చెందిన తరుణ్ అనే యువకుడికి ఓ డేటింగ్ యాప్ లో యువతి నుంచి సందేహం వచ్చింది. ఆపై ఇద్దరి మధ్యా చాటింగ్, వీడియో కాల్స్ జోరుగానే సాగాయి. ఈక్రమంలో యువకుడి వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను ఆ అమ్మాయి సేకరించి పెట్టుకుంది. ఆపై బెదిరింపులకు దిగిన ఆమె, తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, తన వద్ద ఉన్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరికలకు దిగింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచనతో పలు దఫాలుగా రూ. 73 వేలను ఆమె చెప్పిన ఖాతాలో జమ చేశాడు. అయినా ఆమె నుంచి వేధింపులు తగ్గకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyber Crime  Dating App  Tarun  Padmarao nagar  woman  man duped of 0.75 lakh  Honey-trap  Crime  

Other Articles