Steroids can save seriously ill corona patients: new study కరోనా మరణాలకు కవచంలా స్టెరాయిడ్స్: అధ్యయనం

Steroids can be lifesaving for a few seriously ill covid 19 patients new study

coronavirus,corticosteroids, COVID-19, cure, examethasone, favipar, hydrocortisone, methylprednisolone, Pandemic, remdesivir, Steroids, therapies, Vaccine, WHO, coronavirus update, coronavirus cases, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

International clinical trials published the hope that cheap, widely available steroid drugs can help seriously ill patients survive COVID-19, the illness caused by the coronavirus. Based on the new evidence, the World Health Organization issued new treatment guidance, strongly recommending steroids to treat severely and critically ill patients, but not to those with mild disease.

కరోనా మరణాలకు కవచంలా నిలుస్తున్న స్టెరాయిడ్స్: తాజా అధ్యయనం

Posted: 09/11/2020 04:46 PM IST
Steroids can be lifesaving for a few seriously ill covid 19 patients new study

(Image source from: Hmtvlive.com)

కరోనా మహమ్మారి విజృంభిన ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ప్రతీ రోజు సుమారు 90 వేల కేసులు నమోదవుతూనే వున్నాయి. కోవిడ్ కేసుల నమోదులో ముందున్న అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే వుంది. ఇక ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచంపై పడి తొమ్మది నెలలు కావస్తున్నా.. దాని బారిన పడిన వారిని నయం చేసేందుకు మందులను తీసుకువచ్చిన వైద్యవర్గాలు.. దాని బారిన పడకముందే తీసుకునే టీకాను మాత్రం ఇంకా తీసుకురాలేకపోయారు. అయితే కరోనా బారిన పడి అసువులు బాస్తున్న ప్రాణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో మరణాలను తగ్గించేలా వైద్యవర్గాల చికిత్స విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

కరోనా వైరస్ ప్రభావానికి గురై రోగులు విషమ పరిస్థితులకు నెట్టివేయబడటంలో చివరాఖరు దశలో వారిని కాపాడటం తమకు చాలా కష్టంగా మారుతుందని, ఇలా ప్రాణాలను కోల్పోతున్న వారి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నామని ఇప్పటికే వైద్యవర్గాలు వెల్లడించాయి, ఇక ఈ వైద్యం ఖర్చుతో కూడకున్నది కావడం కూడా కొంత ఇబ్బందికి గురిచేస్తోందని పేర్కోన్నారు. అయితే తాజా అధ్యయనం మాత్రం కరోనా బారిన పడి విషమ పరిస్థితుల్లో వున్న రోగుల్లో మరణాలను కొంత మేర తగ్గించేందుకు బలమైన స్టెరాయిడ్స్ కూడా దోహదపడుతోందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అమోదించింది. దీంతో కరోనా బాధిత కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

నోప్పులు, వాపు సహా తీవ్రవైన రోగాలకు ఇచ్చే అత్యంత చౌకైన స్టెరాయిడ్స్ తో కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా వున్న రోగులకు చికిత్స అందించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మందులు సంక్రమణ వలన మరణించేవారి సంఖ్యను 20 శాతం తగ్గించగలమని తెలిపింది. కాగా, ఈ మందులను కరోనా ప్రారంభస్థాయిలో వున్న రోగులలో మాత్రం ఎలాంటి ఫలితాలను ఇవ్వదని స్పష్టం చేసింది. ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ (జామా)లో ప్రచురించింది. అయితే ఈ ధశకు చేరిన కరోనా రోగులలో వందింట ఎనమిది మంది మాత్రమే స్టెరాయిడ్ల వాడకాన్ని తట్టుకోగలరని పేర్కొంది. అయితే కరోనాకు స్టెరాయిడ్ చికిత్సే కాదని అయినా ఫలితాలను మాత్రం ఇస్తోందని వెల్లడించారు.

ఈ ఫలితాలపై ప్రపంచ అరోగ్య సంస్థ క్లినికల్ కేర్ హెడ్ జానెట్ డియాజ్ స్పందిస్తూ.. కరోనా రోగులపై మూడుసార్లు స్టెరాయిడ్ పరీక్షలు జరిగాయని, వీటి వల్ల రోగులు మరణించే ప్రమాదం తగ్గిందని విచారణలో వెల్లడైందన్నారు. కరోనా రోగులకు డెక్సామెథాసోన్, హైడ్రోకార్టిసోన్ మరియు మిథైల్ప్రెడిసోలోన్ వంటి స్టెరాయిడ్ మందులు ఇచ్చారు. ఇవి రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంచాయన్నారు. బ్రిటన్, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్లో స్టెరాయిడ్ల క్లినికల్ ట్రయల్స్ జరిగాయని తెలిపారు. ఈ పరిశోధన ఆసుపత్రులలోని తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులపై మాత్రమే జరిగింది. సాధారణంగా, స్టెరాయిడ్లు ఆర్థరైటిస్, ఉబ్బసం లేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు వినియోగిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles