Man held for deceiving MLA Vidadala Rajini మోసగాడి ఆటకట్టించిన ఎమ్మెల్యే విడుదల రజనీ.!

Man held for deceiving mla vidadala rajini posing himself as cmo official

YSRCP. MLA Vidadala Rajini, Covid Funds, Chilakaluripet, Vidadala Rajini, Jagjivan Rao, CMO official, Chilakaluripet news, Andhra Pradesh, Politics

The police have arrested a man named Jagjivan Rao, a resident of Visakhapatnam for exploiting money from MLA Vidudala Rajini under the pretext of releasing the government funds.

మోసగాడి ఆటకట్టించిన ఎమ్మెల్యే విడుదల రజనీ.!

Posted: 09/10/2020 04:55 PM IST
Man held for deceiving mla vidadala rajini posing himself as cmo official

రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులను ఈజీగా మోసం చేసి.. వారి నుంచి అందిన మేరకు డబ్బులు నొక్కేసే కేటుగాళ్లు గురించి మనం అడపాదడపా వింటున్నాం. ఇది కూడా ఆ ప్రముఖులు తమకు బాగా తెలిసిన వారికి విషయాలను చెప్పడంతో.. వారు మోసపోయిన విషయం ఆలస్యంగానే వెలుగుచూస్తుంది. అయితే ఇలాంటి విషయాలను పోలీసులు, ఇలాంటి మోసాలకు పాల్పడే నేరగాళ్లను మినహాయించి మిగతా వారందరూ తమ వ్యవహరాలతో నిమగ్నమై మర్చిపోవడం కామన్. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఎందుకనో మోసాన్ని పసిగట్టింది. వాకాబు చేసింది. నిర్థారించుకుంది. అంతే ఇక మోసగాన్ని ఆటను చాకచక్యంగా కట్టించింది.

ఆ ఎమ్మెల్యే మరోవరో కాదు అధికార వైసీపీ పార్టీకి చెుందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ. అమెను రూ. 4 లక్షల మేర మోసం చేయాలని చూసిన ఘరానా మోసగాడి ఆటకు అమె చాకచక్యంగా చెక్ పెట్టింది. ప్రస్తుతం గుంటూరు పోలీసుల అదుపులో వున్న కేటుగాడు ఊచలు లెక్కపెడుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో ఉంటున్న రజనీకి మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేసి తనను తాను బాబూ జగ్జీవన్‌రావుగా పరిచయం చేసుకున్నాడు. సచివాలయంలో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయల చొప్పున మంజూరయ్యాయని, ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల చొప్పున రుణాల రూపంలో 8 మందికి కొవిడ్ నిధులు మంజూరు చేస్తారని చెప్పాడు.

ఒక్కో లబ్ధిదారుడు రూ. 50 వేల చొప్పున మొత్తం 4 లక్షల రూపాయలను ఆర్టీజీఎస్ ద్వారా అరగంటలో తన ఖాతాకు పంపాలని సూచించాడు. ఈ క్రమంలో సీఎం జగన్ పేరును పదేపదే ప్రస్తావించాడు. డబ్బులు చెల్లించకుంటే చిలకలూరిపేట నియోజకవర్గానికి కొవిడ్ నిధులు దక్కకుండా పోతాయన్నాడు. నిందితుడి మాటలు నమ్మిన ఎమ్మెల్యే రూ. 4 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే, నిందితుడు పలుమార్లు జగన్ పేరును ప్రస్తావించడం, ఆయనే మీతో మాట్లాడమన్నారని చెప్పారని చెప్పడంతో ఎమ్మెల్యే రజనీకి అనుమానం వచ్చింది. దీంతో సీఎం కార్యాలయంలోని అధికారులను ఆరా తీయగా, జగ్జీవన్‌రావు పేరుతో ఎవరూ లేరని తేలింది. దీంతో ఆమె డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు.

డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి రంగంలోకి దిగారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు జగ్జీవన్‌రావు విశాఖలో ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలిసిన రజని తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పరవాడ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. అనంతరం పట్టాభిపురం ఎస్సై సత్యనారాయణతోపాటు మరో ముగ్గురు పోలీసులు విశాఖ వెళ్లి పరవాడ పోలీసుల సాయంతో నిందితుడు బాబూ జగ్జీవన్‌రావును అరెస్ట్ చేసి గుంటూరు తరలిస్తున్నారు. నిందితుడిపై ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP. MLA Vidadala Rajini  Covid Funds  Chilakaluripet  Jagjivan Rao  Andhra Pradesh  Politics  

Other Articles