Key Turning point in Tv Actress Suicide Case టీవి నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు..

Key turning point in tv actress sravani suicide case audio clip out

telugu tv actress dies by suicide, tv actress sravani kondapalli suicide, telugu tv actress, suicide, sravani kondapalli, Sravani, Osmania Hospital, mounaraagam, Manasu Mamatha, Devaraju Reddy, Blackmail, SR nagar police, Hyderabab, crime

The Sucide case of telugu TV actress Sravani Kondapally had taken a key turning point as the audio clip claiming to be her and her friend DevaRaju Reddy is out and doing rounds in social media. DeveRaj allegedly Threatening her to spend an hour time with him lonely.

టీవి నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు..

Posted: 09/10/2020 12:34 AM IST
Key turning point in tv actress sravani suicide case audio clip out

(Image source from: Thenewsminute.com)

‘మనసు మమత’, ‘మౌనరాగం’ ధారావాహికలో నటించిన బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని వాదిస్తూ వచ్చిన దేవరాజు రెడ్డికి సంబంధించిన అడియో క్లిప్ బహిర్గతం కావడంతో పాటు నెట్టింట్లో వైరల్ గా మారంది. దీంతో అతని వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. నటి శ్రావణి ఆత్మహత్య  కేసులో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా ఇప్పటికే పలు ప్రాథమిక సాక్ష్యాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరైన వ్యక్తి బెదిరింపులకు మానిసక అందోళన చెందిన అమె ఈ విపరీత నిర్ణయానికి పాల్పడిందా.? అన్నది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి వుంది.

కాగా, దేవరాజ్ అరోపణలు చేసిన సాయి కృష్ణారెడ్డి కూడా స్పందించాడు. తనపై దేవరాజ్ రెడ్డి చేసిన అరోపణలన్నీ అబూత కల్పనలని తోసిపుచ్చాడు, ఈ మేరకు ఆయన ఓ వీడియోను మీడియాకు విడుదల చేశాడు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని మాత్రమేనని అన్నాడు. బంగారు భవిష్యత్తు వున్న శ్రావణి జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని తెలిపాడు. అమె ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి అమె తల్లిదండ్రులతోనే వున్నానని, చెట్టంత కూతుర్ని కోల్పోయిన అమె తల్లిదండ్రులను ఓదార్చుతున్నానని చెప్పాడు. దేవరాజ్ రెడ్డి అరోపించినట్లుగా తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశాడు.

శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం వుందన్న ఆయన అమె ఆత్యహత్యకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం కాదని చెప్పాడు. ఇదిలావుండగా, ఈ కేసులో మృతురాలు శ్రావణికి, దేవరాజు రెడ్డికి మద్య సాగిన సంభాషణ ఆడియో టేపులో దేవరాజ్ శ్రావణిని బెదిరించినట్టు వుంది. తనతో మర్యాదగా వచ్చి గంట సమయాన్ని గడపాలని లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడ్ని కాదని హెచ్చరించినట్లు వుంది, కాగా శ్రావణి కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది, ప్రేమికుడు వేధింపులు, కుటుంబసభ్యుల మందలింపుల పరిణామాలతో పాటు గతంలో శ్రావణి దేవరాజు రెడ్డిపై ఇచ్చిన పిర్యాదులను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles