Medak Additional Collector under scanner రెవెన్యూశాఖలో అవినీతి జలగ.. ఎన్వోసీ కోసం లంచం..

Additional collector under scanner for allegedly accepting 1 12 cr bribe

Anti corruption, ACB, Additional Collector, Nagesh, DSP Suryanarayana, 1.12 crore, K Linga Murthy. Chippalaturthi MRO. sattar, Narsapur, Medak, Telangana, Crime

Anti-Corruption Bureau officials landed at the residence of Medak District Additional Collector, G Nagesh. The residence in Machavaram in Medak Town was raided by the ACB sleuths after they received a complaint regarding a bribe of Rs 1.12 cr allegedly accepted by the Additional Collector

రెవెన్యూశాఖలో పెద్ద అవినీతి జలగ.. ఎన్వోసీ కోసం లంచం..

Posted: 09/09/2020 11:57 PM IST
Additional collector under scanner for allegedly accepting 1 12 cr bribe

రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకువస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ.. చివరాఖరకు వీఆర్వోల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేందుకు కూడా కారణమైన విషయం తెలిసిందే. అయితే ఇంతలా చట్టంలో మార్పులు తీసుకువస్తానన్నది మాత్రం ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన లంచగొండి వ్యవస్థ కోసమేనన్న విషయం మాత్రం జగమెరిగిన సత్యమే. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు సాహసించిన వారిపై రెవెన్యూ అధికారుల సంఘాలు విరుచుకుపడుతుంటాయి. మరో మాట మాట్టాడితే పరువు నష్టం దావాలకు సైతం సిద్దమని హెచ్చరికలు చేస్తాయి. కానీ అందరూ అయ్యవార్ల మధ్య మద్యంసీసా మాయమైందన్న రితీనే వుంటాయన్న ప్రజాభియోగాన్ని మాత్రం పట్టించుకోరు.

ఇక తాజాగా రెవెన్యూశాఖలో పెద్ద అవినీతి జలగను ఇవాళ ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ స్థాయిలోని వ్యక్తి ఏసీబి అధికారుల ఏకంగా రూ.40 లక్షల లంచం డబ్బుతో పట్టుబడ్డారు. ఈ ఘటన వెలుగుచూడటంతో ఈ వ్యవహారంలో స్థానిక అధికారుల ప్రయేయంపై కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డిలో వున్న చిలిపిచేడ్ తహశీల్ధార్ ఎం డి సత్తర్ ఇంట్లో ఉదయం నుంచి రాత్రి 8 గంటలు సోదాలు నిర్వహించారు. 114 ఎకరాల భూ పట్టాల మర్పడి కోసం ఎకరానికి లక్ష రూపాయల లంచాన్ని తీసుకున్న అదనపు కలెక్టర్ నాగేశ్ తో పాటు ప్రధాన సూత్రధారైన తహశీల్దార్ సత్తర్ ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట అసెంబ్లీలో అవినతి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన తరుణంలోనే మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ చిలిపిచేడ్ తసీల్ధార్ ఎండి సత్తర్ లు ఏకకాలంలో అదే వ్యవస్థలో లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. బాధితుల పిర్యాదు మేరకు ఏకకాలం సిటీ రేంజ్ వన్ ఏసీబి అధికారులు పక్క సమాచారం తో రైడ్ చేశారు.ఇందులో మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్ 40 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ కి దొరికారు. మిగితా డబ్బులు చెక్కుల రూపంలో దొరికాయి. ఈ వ్యవహారంలో ఎండి సత్తార్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చెపట్టారు. తహసీల్ధార్ ఇంట్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంటే 9 గంటలు సోదాలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles