Students future and safety our prime concern Minister షెడ్యూల్డు ప్రకారమే నీట్, జేఈఈ పరీక్షలు: కేంద్రమంత్రి

Students future and safety our prime concern education minister

Supreme Court, NEET 2020, JEE 2020, neet exam, jee exam, Joint Entrance Exams, National Eligibility cum Entrance Test, neet-jee exams 2020, supreme court in neet-jee exams, neet-jee exams latest news, Union Education Minister, Ramesh Pokhriyal, coronavirus, covid-19

The safety and future of the students was the topmost priority with regard to the conduction of the JEE and NEET amid the COVID-19 pandemic, said Union Education Minister Ramesh Pokhriyal Nishank adding that several steps, including the increase in the number of exam centres, had been taken.

షెడ్యూల్డు ప్రకారమే నీట్, జేఈఈ పరీక్షలు: కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్

Posted: 08/28/2020 12:16 AM IST
Students future and safety our prime concern education minister

(Image source from: Twitter.com/ANI)

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో జరగాల్సిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలు ఈ సారి ఎప్పుడు జరగుతాయన్న విషయమై తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన బీజేపియేతర ముఖ్యమంత్రులతో విపక్షా నేత సోనియాగాంధీ సమావేశమై నీట్, జేఈఈలపై ఏం చేద్దామని చర్చించిన తరువాత ఇవాళ ఏకంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఏకంగా ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసి మరీ నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. కాగా తాజాగా ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 

జేఈఈ, నీట్ పరీక్షలను తప్పక షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని, కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి తోసివేయలేమని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ‘జీవిత ప్రయాణాన్ని ఆపలేం. భద్రతాపరమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. విద్యార్థులు సంవత్సర కాలన్ని వృథా కానివ్వోద్దు అని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మరోమారు కీలక ప్రకటన చేశారు. నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

జేఈఈ పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకు గానూ 7.5 లక్షల అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ డీజీ తనతో చెప్పారని విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. నీట్ పరీక్షకు సంబంధించి మొత్తం 15.97 లక్షల అడ్మిట్ కార్డులకు గాను... 10 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సుముఖంగా ఉన్నారనే విషయం దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా నేపథ్యంలో జేఈఈ పరీక్షా కేంద్రాలను 570 నుంచి 660కి పెంచామని... అదేవిధంగా నీట్ కేంద్రాలను 2,546 నుంచి 3,842కి పెంచామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles