AP HC issues notice to CM Jagan over three capitals సీఎం జగన్, మంత్రులకు హైకోర్టు నోటీసులు

Ap hc issues notice to cm jagan tdp bjp over three capitals

High Court bench, Amaravati, Capital, CRDA, Chief Minister YS Jagan Mohan Reddy, YSRCP, BJP, TDP, Ministry of Home Affairs, Supreme Court

AP High Court issued notice to Chief Minister YS Jagan Mohan Reddy, cabinet ministers, TDP and BJP over setting up three capitals for Andhra Pradesh. Advocate of the petitioner has informed the High Court that Jagan Mohan Reddy had agreed for the AP capital in Amaravati.

ముఖ్యమంత్రి జగన్, మంత్రులతో పాటు బీజేపి, టీడీపీలకు హైకోర్టు నోటీసులు

Posted: 08/28/2020 12:35 AM IST
Ap hc issues notice to cm jagan tdp bjp over three capitals

(Image source from: Twitter.com/AndhraPradeshCM)

ఆంధ్రప్రదేశ్ రాజధాని, సీఆర్డీఏ రద్దు అంశానికి సంబంధించి కేసును వచ్చే నెల 21 నుంచి రోజువారీగా విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయం తీసుకున్న రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అదే విషయమై నోటీసులు జారీ చేసింది, విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో అమల్లో ఉన్న సమయంలో అతిథిగృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆయన చెప్పారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని ఆయన తెలిపారు.

దీనిపై కూడా వచ్చేనెల 10 లోపు కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి, జగన్, మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే తెలుగుదేశం, బీజేపీలకు నోటీసులు జారీ చేసింది. రాజధాని తరలింపుకు దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేశారని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట మారుస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎంతోపాటు మంత్రివర్గం, రాజకీయపార్టీలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ, బీజేపీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

కాగా, స్టేటస్‌కోను ఎత్తేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించడం, హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోమంటూ ఆ పిటిషన్లను నిన్న అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడం తెలిసిందే. ఇక‘బిల్డ్ ఏపీ’ పేరుతో విశాఖలో అమ్మాలనుకున్న ఆరు స్థానాల్లో రెండు స్థలాల హైకోర్టు స్టే ఇచ్చింది. చినగదిలి మండలంలోని చినగదిలి మండలం డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో 75 సెంట్ల స్థలం, ఏఆర్ పోలీస్ క్వార్టర్స్‌లో ఎకరం స్థలంపై హైకోర్టు స్టే విధించింది. అగనంపూడిలో భూముల విక్రయంపైనా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ‘బిల్డ్ ఏపీ’ పేరుతో విశాఖలో అమ్మాలనుకున్న ఆరు స్థానాల్లో రెండు స్థలాల హైకోర్టు స్టే ఇచ్చింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా ‘బిల్డ్ ఏపీ’ పేరుతో కొత్త పథకాన్ని తెచ్చింది. దీనికనుగుణంగా గుంటూరు, విశాఖ జిల్లాలలోని కొన్ని భూములను ‘ఇ-వేలం’ వేయడానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ పథకం ద్వారా అవసరం లేని ప్రభుత్వ భూములను మార్కెట్ ధరకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించిందని పలువురు విశ్లేషిస్తున్నారు. బిల్డ్ ఏపీ మిషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్ లెవెల్ మోనిటరింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసి)ని ఏర్పాటు చేసింది. దీనికి సంభంధించి జిఓ 447ను విడుదల చేశారు. అసలు ప్రభుత్వ భూములు ఇలా అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న కూడా వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles