Rains for Telangana for next three days: IMD తెలంగాణలో మరో మూడు రోజులూ వర్షం..

Imd predicts more rains in telangana for next three days

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

With the Southwest Monsoon intensifying across Telangana, different parts of the State have been receiving heavy rainfall since four continous days, the IMD has predicted more rains over the state for next three days.

తెలంగాణలో ఎడతెరపి లేని వర్షం.. మరో మూడు రోజులూ..

Posted: 08/19/2020 03:08 AM IST
Imd predicts more rains in telangana for next three days

(Image source from: Thehansindia.com)

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని భారతీయ వాతావరణ కేంద్రం ముందస్తుగా చేసిన అంచానాలు అధిగమించి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు గోదావరి నది పరిహారిక ప్రాంతం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కకుంది, ఇటు భద్రాచలం, అటు గోదావరి ప్రాంతాలు జలమయం అయ్యాయి, దీంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది, గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. 

ఇక ఈ తరుణంలో మరో చేదు వార్తను చెప్పింది భారతీయ వాతావరణశాఖ. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇది రుచించని వార్తే. అదేంటంటే ఇప్పటికే వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధ్రోణి ప్రభావంతో పాటు సముద్రమట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తున వ్యాపించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి, ఈరోజు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, కొమరంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో ఈరోజు, రేపు అతి భారీ, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగస్టు 19వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles