Terrorists gun down two JK policemen in Baramulla బారాముల్లా ఎన్ కౌంటర్లో ఉగ్రవాది హతం..

Encounter in j ks baramulla after three security personnel killed in attack

Hours after a militant attack left two CRPF jawans and a Jammu and Kashmir policeman dead in Baramulla district of the union territory on Monday, security forces chased the ultras and killed one of them in an encounter, police said.

బారాముల్లా ఎన్ కౌంటర్లో కాల్పులు జరిపిన ఉగ్రవాది హతం..

Posted: 08/17/2020 09:41 PM IST
Encounter in j ks baramulla after three security personnel killed in attack

(Image source from: Twitter.com/ANI)

జమ్ముకశ్మీర్ లో ఒక ఉగ్రవాదిని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి, అక్రమంగా భారత భూభాగంలోకి చోచ్చుకోచ్చి కాల్పులకు తెగబడిన ఇద్దరు సీఆర్పీఎఫ్, ఒక జమ్మూకాశ్మీర్ పోలీసు మరణానికి కారణమై ఉగ్రవాదులను వెంబడించిన భారత బద్రతా బలగాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఉగ్రవాదిని భారత బలగాలు హతమార్చాయి, ఈ ఎన్ కౌంటర్ జమ్మూకాశ్మీర్ లోని ఉత్తర కాశ్మీర్ పరిధిలోని బారముల్లా ప్రాంతంలోని క్రేరీ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఎన్ కౌంటర్లో తప్పించుకుని పారిపోయిన ముష్కరమూలను పట్టుకునేందుకు ఆయా ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నాయి భద్రతా ధళాలు. బారాముల్లా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ అపరేషన్ కొనసాగుతోంది.

అంతకు కొన్ని గంటల ముందు బారాముల్లా జిల్లాలోని కెర్రి ప్రాంతంలో గస్తీలో వున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ముగ్గురు భారతీయ జవాన్ల హతమార్చారు, బారాముల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లాలోని క్రీరి చెక్ పోస్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌, జమ్ము పోలీసులు కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున చెక్ పోస్టు వద్ద ఉన్న పోలీసులపై ముగ్గురు లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరాయయ్యారు.

ముష్కరులు చెక్ పోస్టు వద్దనున్న పోలీసులపై కాల్పులు జరిపి హతమర్చారన్న సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు అదనపు బలగాలు పంపించామని జమ్ముకశ్మీర్‌ ఐజీ విజయ్ కుమార్‌ వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం సమీపంలోని దట్టమైన పోదల్లోంచి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. ఇది అత్యంత రిపోట్ గ్రామీణ ప్రాంతంలో వున్న చెక్ పోస్టు కావడంతో అక్కడి చెక్ పోస్ట్ నిర్వహణ కేవలం ముగ్గరు సభ్యులనే నియమించామని, ఈ విషయం తెలిసే ఉగ్రవాదులు వారిని టార్గెట్ చేసి వుంటారని ఆయన అన్నారు, కాగా గడిచిన వారం రోజుల్లో పోలీసులపై దాడులు జరగడం ఇది మూడోసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles