Careers Can't Be Put In Jeopardy: SC షెడ్యూల్డు ప్రకారమే ఇక నీట్, జేఈఈ పరీక్షలు..

Careers cant be put in jeopardy supreme court wont defer neet jee

Supreme Court,NEET 2020,JEE 2020,neet exam,jee exam,neet-jee exams 2020,supreme court in neet-jee exams,supreme court latest news,neet-jee exams latest news,neet-jee exams news today,supreme court dismisses plea to defer neet-jee exams,coronavirus,covid-19

The NEET medical entrance exam and the Joint Entrance Examination (JEE) for admission into the IITs will be held as per schedule, the Supreme Court said today. 'The careers of students cannot be put under jeopardy,' the top court said as it dismissed a petition by 11 students to defer the exams due to the coronavirus crisis.

షెడ్యూల్డు ప్రకారమే ఇక నీట్, జేఈఈ పరీక్షలు..

Posted: 08/17/2020 10:25 PM IST
Careers cant be put in jeopardy supreme court wont defer neet jee

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో జరగాల్సిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలు ఈ సారి కేంద్రం తాజాగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయి. ఈ పరీక్షలను వాయిదా వేయలేమని తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టలేమని అభిప్రాయపడిన న్యాయస్థానం పరీక్షలను యధతధంగా ప్రకటిత తేదీలలో నిర్వహించాలని అదేశించింది. అయితే అదే సమయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వైరస్ సోకకుండా తగు జాగ్రత్త చర్యలను కూడా చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభన కోనసాగుతున్న తరుణంలో విద్యార్థులు ప్రాణాలను పన్నంగా పెట్టి పరీక్షలను నిర్వహించడం అవసరమా అంటూ పదకొండు మంది విద్యార్థులు ఈ పరీక్షలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలలని వారు సుప్రింకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కోన్నారు. వారి పిటీషన్ ను ఇవాళ విచారించిన న్యాయస్థానం.. విద్యార్థులు దాఖలు చేసిన పిటీసన్ ను తోసిపుచ్చింది. ఈ కారణంతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి తోసివేయలేమని తీర్పునిచ్చింది.

‘జీవిత ప్రయాణాన్ని ఆపలేం. భద్రతాపరమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. సంవత్సరం మొత్తాన్ని వృథా చేసుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారా? విద్య అందుబాటులో ఉండాలి. కొవిడ్ ఇంకో సంవత్సరంపైగా కొనసాగవచ్చు. ఇంకో సంవత్సరం ఎదురుచూస్తారా? ఈ వాయిదా వల్ల దేశానికి, విద్యార్థులకు జరిగే ప్రమాదం మీకు తెలుసా?’ అంటూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. సెప్టెంబరులో ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కాగా, నీట్‌, జేఈఈకు దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచేలని, ఇక తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  NEET 2020  JEE 2020  coronavirus  covid-19  neet exam  jee exam  Education news  

Other Articles