Ashok Gehlot to seek trust vote రాజస్థాన్ సంక్షోభం: బీజేపి ఎత్తుకు గెహ్లాట్ సర్కార్ పైఎత్తు..

Ashok gehlot says trust vote will be victory of truth unity of congress mlas

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Ahead of the Rajasthan government's floor test in the special assembly session and day after his patch-up with Sachin Pilot and his camp, Chief Minister Ashok Gehlot said the outcome of the trust vote would be the victory of truth and the unity of the Congress MLAs in the state.

రాజస్థాన్ సంక్షోభం: బీజేపి ఎత్తుకు గెహ్లాట్ సర్కార్ పైఎత్తు..

Posted: 08/14/2020 01:18 PM IST
Ashok gehlot says trust vote will be victory of truth unity of congress mlas

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన పెను సంక్షోభం.. టీ కప్పులో తుఫానులా చల్లారింది. ఈ తరుణంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే రాజకీయ ఎత్తుకు బీజేపి ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో అపార రాజకీయ అనుభవం వున్న అశోక్ గెహ్లెట్ బీజేపి ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు ప్రణాళికను సిద్దం చేశారని సమాచారం, దీంతో రాజస్థాన్ ప్రజామోదం పోందిన తమ ప్రభుత్వమే చివరి వరకు కొనసాగుతోందని ప్రజలతో పాటు ఇటు బీజేపి నాయకులకు కూడా సంకేతాలను పంపనున్నారు. కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరిగి పార్టీలో చేరిన సందర్భంలో బీజేపి ఎలాంటి ఎత్తు వేసింది.. దానికి గెహ్లోట్ ఎత్తుకు పైఎత్తు ఎలా వేయనున్నారన్న అంశాల్లోకి ఎంట్రీ ఇస్తే..  

గెహ్లాట్ సర్కారును గుప్పతిప్పుకోనీయకుండా చేయాలని అందుకోసం సచిన్ పైలట్ వర్గం కలసిన తరువాత కూడా ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష బీజేపీ ప్రణాళిక రచించింది. అయితే బీజేపి వేసిన రాజకీయ ఎత్తుగడను అపారా అనుభవశాలైన అశోక్ గెహ్లాట్ విపక్షానికి అలాంటి అవకాశం ఇవ్వకుండానే పావులు కదుపుతున్నారు, ఈ రాజకీయ వ్యూహంలో భాగంగా తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానానికి వెళ్లాలని భావిస్తోంది. ఇందుకోసం నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలనే వేదికగా చేసుకోవాలని, సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు. నిన్న సచిన్ పైలట్ తో సమావేశమైన తరువాత, ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం విశ్వాస తీర్మానాన్ని సీఎం కాకుండా మిగతా సభ్యుడెవరైనా ప్రతిపాదించాల్సి వుండటంతో దాన్ని సచిన్ పైలట్ చేతనే ప్రతిపాదించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. తద్వారా 200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో తనకు 102 కన్నా ఎక్కువ మంది సభ్యులున్నారని నిరూపించడమే ఆయన ఉద్దేశమని సమాచారం. ఇదే జరిగితే, మరో ఆరు నెలల పాటు బీజేపీ, రాష్ట్రంలో గెహ్లాట్ సర్కారును పడగొట్టడానికి ఎటువంటి వీలూ ఉండదు.

ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం గెహ్లాట్ ప్రభుత్వానికి 125 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత నెలలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఈ బలం 100 దిగువకు వస్తుందని భావించినప్పటికీ, సచిన్ తిరిగి రావడంతో పూర్తి స్థాయిలో గెహ్లాట్ సర్కారు తిరిగి పుంజుకున్నట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, బీజేపీకి ప్రస్తుతం 72 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైనంత బలం ఆ పార్టీకి ఉన్నప్పటికీ, అవిశ్వాస తీర్మానం కోసం ముందడుగు వేస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో భంగపాటు తప్పదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles