Four of family found dead in Telangana సంచలనం రేపుతున్న వనపర్తి ఆనుమాన్సద మరణాలు

Four of a family die in wanaparthy witchcraft suspected

wanaparthy family suspicious death, telangana family suspicious death, Revalli family suspicious death, nagpur family suspicious death, witch craft, Telangana news, today Telangana news, Wanaparthy latest news, witchcraft suspected, witchcraft, Telangana, crime

In what appears to be a case of 'witchcraft', four people of a family died under suspicious circumstances here at Nagapur village of Revali mandal of Wanaparthy district. The police registered a case of suspicious deaths and launched an investigation. The dead bodies were shifted to a hospital for post-mortem.

వనపర్తి జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

Posted: 08/14/2020 06:57 PM IST
Four of a family die in wanaparthy witchcraft suspected

తెలంగాణలో విషాధ ఘటన చోటుచేసుకుంది, వనపర్తి జిల్లా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది, వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఇవాళ ఉధయం ఈ ఘటన చోటుచేసుకుంది, ఉదయం నుంచి కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లోంది బయటకు రాకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇరుగుపోరుగు వారు వారింట్లోకి వెళ్లి చూడగా, ఇంటిలో నాలుగు మృతదేహాలు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో పడివున్నాయి, ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్నపోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతులను ఆజీరాం బీ(63,) ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా(10)గా గుర్తించారు. వారి ఇంట్లోని వంట గదిలో అజీరాం బీ మృతదేహం ఉండగా, డైనింగ్‌ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక ఖాజా పాషా, హాలులో హసీనా మృతదేహాలు కనపడ్డాయి. శుక్రవారం ఉదయం 7గంటల దాటినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా... నలుగురూ విగత జీవులై పడి ఉన్నారు. వెంటనే పోలీసులు, మృతుల బంధువులకు సమాచారమందించారు. అయితే ఈ ఇంట్లో ఎవరైనా సభ్యులకు క్షుద్రపూజలు చేస్తారా అన్నా విషయంలోనూ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది.

వారింట్లో క్షుద్రపూజలు చేసినట్లుగా కొన్ని గుర్తులు కనపడ్డాయి. ఖాజా పాషా మృతదేహం పక్కన కొబ్బరికాయ, నిమ్మకాయలు ఉండడంతో పాటు అక్కడే ఓ గొయ్యి ఉంది. వీరిని ఎవరైనా హత్య చేరారా? లేక వారంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. లేక క్షుద్రపూజలు చేసేందుకు వచ్చిన వ్యక్తులే ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారా,? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కోనసాగుతోంది, అయితే పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు మృతుల మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ రక్తపు గాయాలు కానీ కనిపించలేదని పోలీసులు తెలిపారు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో నాగపూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles