Telangana govt to conduct Eamcet in Sept తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు తేదీల ఖరారు..

Telangana govt proposes to conduct eamcet in sept second week

ts eamcet exam date,ts eamcet 2020 exam date,Sabitha Indra Reddy,medical common entrance test,K Chandrasekhar,Jawaharlal Nehru Technological University,High Court

Telangana government has proposed to conduct the engineering, agriculture and medical common entrance test (Eamcet) on September 9, 10, 11 and 14, Polytechnic common entrance test (Polycet) on September 2 and engineering common entrance test (Ecet) on August 31.

తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు తేదీల ఖరారు..

Posted: 08/11/2020 12:27 AM IST
Telangana govt proposes to conduct eamcet in sept second week

(Image source from: english.sakshi.com)

కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయా.? అని పాఠశాల యాజమాన్యాలు ఎదురుచూస్తున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం వారి  ఎదురుచూపులపై నీళ్లు చల్లింది. అయతే ఈసెట్, పాలీసెట్, ఎంసెట్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించే విషయమై ప్రతిపాదిత తేదీలను వెల్లడించింది. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఈ తేదీలు వచ్చే నెల ప్రారంభంలోనూ పలు పరీక్షలను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కోంది.

పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసుల నిర్వహణ నుంచి ఎంసెట్ వరకు ఎప్పుడెప్పుడు ఏయే పరీక్షలను నిర్వహించే విషయమై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తేదీలను మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభమవుతాయని అమె ప్రకటించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. సోమవారం ఆమె విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ప్రవేశ పరీక్షలు, పరీక్షలు, విద్యా సంవత్సరంపై కీలకంగా సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఉంటాయన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31న ఈ సెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌  9, 10, 11, 14న ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి అన్నారు. ఇప్పటికే ఎంసెట్‌ సహా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ కరోనా విజృంభణతో అవన్నీ వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తి ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో, పరీక్షలు ఎప్పుడు  జరుగుతాయో అనే ఆందోళనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles