Bhanwarlal Sharma meets Ashok Gehlot రాజస్థాన్ సంక్షోభం: గెహ్లాట్ కు జైకొట్టిన బన్వర్ లాల్ శర్మ

Rebel rajasthan congress mla bhanwar lal sharma meets cm ashok gehlot

AICC, Rajasthan Government, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Bhanwarlal Sharma (75), the oldest lawmaker in the Rajasthan assembly, has sided with rebel Congress leader and former Rajasthan deputy chief minister Sachin Pilot amid the power tussle with CM Ashok Gehlot, has spoken against CM Ashok Gehlot.

రాజస్థాన్ సంక్షోభం: గెహ్లాట్ కు జైకొట్టిన బన్వర్ లాల్ శర్మ

Posted: 08/10/2020 11:39 PM IST
Rebel rajasthan congress mla bhanwar lal sharma meets cm ashok gehlot

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితి క్రమంగా సద్దుమణుగుతోంది. ఇప్పటికే ఈ పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో.. ఆయనకు అసమ్మతి వర్గం నుంచి ఓ నేత జైకోట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయి కొన్ని డిమాండ్లు వారి ముందు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు కూడా సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.

తాజాగా సచిన్ పైలట్‌ మద్దతుదారుడైన ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ సీఎం అశోక్‌ గహ్లోత్‌కు జై కోట్టాడు. అంతేకాదు ఏకంగా ముఖ్యమంత్రితో భేటీ అయిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా అసమ్మతి వర్గంలో ఎంతమంది నేతలు వున్నారు.. వారు ఆలోచితా విధానం ఎలా వుంది.. ఎవరితో కలసి ముందుకు వెళ్లాలని యెచిస్తున్నారు అన్న విషయాలపై కూడా చర్చించారని సమాచారం. భన్వర్ లాల్ రాకతో మరికొంత మంది కూడా అసమ్మతి గూటి నుంచి అధికార గూటికి చేరే అవకాశాలు వున్నయని సమాచారం.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గహ్లోత్‌ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. తమ నాయకుడు గహ్లోతేనని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్‌ నేతనేనని స్పష్టం చేశారు. ‘కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కుటుంబ పెద్దపై పిల్లలు అలకబూని కొద్ది రోజులు అన్నం తినకుండా మొండికేస్తారు. మేమూ అంతే. మా నాయకుడిపై అసహనంతో నెలపాటు దూరంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని వివాదాలు సమసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతుంది’అని భన్వర్‌లాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక నిన్నటి వరకు ఉప్పు నిప్పులా సాగిన పైలట్‌, గహ్లోత్‌ మద్దతుదారుల మధ్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోవడంతో అవాక్కయ్యామంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles