Israeli jeweler makes $1.5m gold COVID-19 mask ఈ మాస్క్ ాలా ఖరీదైనది గురూ.. ధర ఎంతో తెలుసా.?

Worlds most expensive coronavirus mask costs over 10 crore

most expensive coronavirus mask, china businessman,white gold mask with diamonds, coronavirus mask,Israeli jewelry company,Diamond,Gold,white gold mask,Price of world's most expensive mask

An Israeli jewelry company is working on what it says will be the world's most expensive coronavirus mask, a gold, diamond-encrusted face covering with a price tag of $1.5 million. The 18-karat white gold mask will be decorated with 3,600 white and black diamonds and fitted with top-rated N99 filters at the request of the buyer, said designer Isaac Levy.

ఈ మాస్క్ చాలా ఖరీదైనది గురూ.. ధర ఎంతో తెలుసా.?

Posted: 08/10/2020 05:44 PM IST
Worlds most expensive coronavirus mask costs over 10 crore

కరోనా మహమ్మారి విజృంభనతో యావత్ ప్రపంచ ప్రజలు అందోళనకు గురవుతున్న తరుణంలో అందరూ దాని నుంచి రక్షణ పొందేందుకు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా దానిని నుంచి పరిరక్షణ పోందేందుకు ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ధనవంతులు మాస్కుల విషయంలోనూ కాస్త వెరైటీగా ఆలోచిస్తున్నారు. తమ డాబు, దర్పాలను ప్రదర్శించడానికి అతి ఖరీదైన మాస్కుల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు.

ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారి బంగారంతో మాస్క్ తయారు చేసుకుని దరించిన విషయం తెలిసిందే.  ఇక ాయన చేతి వేళ్లకు కూడా బంగారు ఉంగరాలు ఉండటంతో ఆయన శ్రీమంతుడేనని వార్తులు వచ్చాయి. ఇక ఆయన ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కావడం కూడా గమనార్హం. ఇక తాజాగా అలాంటి బంగారం తోనే మాస్క్ చేయించుకున్న వ్యక్తి వివరాలు వెలుగులోకి వచ్చింది. అమెరికాలో నివసిస్తోన్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని యోచిస్తూ, దాన్ని ఆర్డర్ చేశారు.

టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని కోరారు. సుమారు 11.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఆ చైనా వ్యాపారి ఈ మాస్కును తయారు చేయించుకుంటున్నారు. జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో పనిచేస్తోన్న డిజైనర్ ఐజాక్ లెవీ ఈ విషయాన్ని వెల్లడించారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి దీని తయారీని పూర్తి చేస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles