Pilots informed About Weather: Aviation Watchdog వాతావరణంపై పైలట్లకు ముందే సమాచారం.. డీజీసీఐ

Pilots told about weather tailwinds aviation watchdog on kerala crash

Kerala, plane crash, Kozhikode, Kerala Plane Crash, air india express crash,Kozhikode Plane Crash, Kozhikode airport, kerala news, air india express flight crash, Air India Express, plane crash news, plane crash in kerala

The pilots of the aircraft that crashed while landing in Kerala's Calicut International Airport on Friday, were alerted about the bad weather in the area. They were also told about the tailwinds, which, however, were 'within permissible limits', Arun Kumar, the Director General of Civil Aviation

వాతావరణంపై పైలట్లకు ముందే సమాచారం.. డీజీసీఐ చీప్ అరుణ్ కుమార్

Posted: 08/10/2020 05:24 PM IST
Pilots told about weather tailwinds aviation watchdog on kerala crash

కోజికోడ్ ప్రమాదఘటనలో ఏకంగా 19 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంలో వాతావరణ అనుకూలతే ప్రధాన కారణమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై స్పష్టతనిచ్చింది డైరెక్టర్ జనరల్ అప్ సివిల్ ఏవియేషన్ చీఫ్ అరుణ్ కుమార్. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని దుబాయ్ నుంచి వందేభారత్ మిషన్ లో భాగంగా వస్తున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్లకు ముందుగానే సమాచారాన్ని అందించామని చీఫ్ అరుణ్ కుమార్ వెల్లడించారు.

ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పడంతో ఇద్దరు పైలట్లు సహా 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. పెనుగాలులు, వర్షం గురించి పైలట్లకు తెలుసునని, అయితే వాతావరణం పూర్తిగా అదుపుతప్పలేదని, అందువల్లే వారు ల్యాండింగ్ కు ప్రయత్నించారని అరుణ్ వివరించారు. ఈ ప్రమాదానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. ఏటీసీ నుంచి పైలట్లకు వాతావరణంపై సమాచారం వెళ్లింది. విమానం రన్ వే చివర్లో వేగంగా ల్యాండ్ అవడాన్ని గమనించిన ఏటీసీ, వెంటనే రెస్క్యూ టీమ్ లను అప్రమత్తం చేసింది.

"ఫైర్ ఫైటర్లు సహా సహాయక సిబ్బంది వెంటనే స్పందించారు. విమానం దగ్గరకు నిమిషాల్లోనే వెళ్లారని ఆయన తెలిపారు. విమానం ప్రమాదానికి గురైన 10 నిమిషాల వ్యవధిలోనే రెస్క్యూ ప్రారంభమైందని వెల్లడించారు. విమానం క్రాష్ ల్యాండ్ అయిన తరువాత, కాక్ పిట్ నుంచి ఏటీసీకి ఏమైనా సమాచారం అందిందా? అన్న ప్రశ్నకు విచారణ తరువాతే ఈ విషయమై సమాచారం లభిస్తుందని తెలిపారు. కాగా, రన్ వే ప్రారంభమైన కిలో మీటర్ తరువాత విమానం వేగంగా వచ్చి ల్యాండ్ కావడం, సురక్షితంగా విమానాన్ని నిలిపేంత రన్ వే అక్కడ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రాథమిక విచారణలో తేల్చింది.

ఈ ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాఫ్తు చేసేందుకు విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ఓ టీమ్ వచ్చే వారంలో ఇండియాకు రానుంది. దీంతో బోయింగ్ సంస్థ విచారణ పూర్తైన తరువాత కానీ పూర్తి వివరాలు వెలుగులోకి రావని తెలుస్తోంది. ఇక దీనికి తోడు కోజికోడ్ విమానాశ్రయం టేబుల్ టాప్ తరహాలో వుంటుందని.. విమానం రన్ వేపై దిగే సందర్భంలో వేగాన్ని నియంత్రించలేకపోవడం కారణమని సమాచారం, దీంతో పాటు రన్ వే పై చివర్లో విమానం దిగడం మరో కారణమని అధికార వర్గాలు ప్రాథమిక నిర్థారణకు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirIndia express  plane crash  DGCI  Arun Kumar  Civil Aviation  weather  kozhikode  kerala  

Other Articles