Ex MP Nandi Yellaiah succumbs to COVID-19 కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

Congress eight time mp nandi yellaiah dies with covid 19 in telangana

Nandi Yellaiah death, who is Nandi Yellaiah, covid 19 in telangana, K Chandrashekhar Rao, congress leader, latest news on Nandi Yellaiah, coronavirus pandemic, coronavirus, covid-19, nandi Yellaiah, former MP, former member of parliament, siddipet, nagar kurnool, covid- death, Telangana, Crime

Senior Congress leader Nandi Yellaiah died of COVID-19 at a hospital here on Saturday, party sources said. Yellaiah(78) was admitted to Nizam’s Institute of Medical Sciences on July 29. Chief Minister K Chandrashekhar Rao conveyed his condolences to the bereaved family of the departed leader, an official release said.

కరోనా విజృంభన: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

Posted: 08/08/2020 05:37 PM IST
Congress eight time mp nandi yellaiah dies with covid 19 in telangana

సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. జులై 29న అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే నంది ఎల్లయ్యను బతికించేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలం అయ్యాయి, కరోనాకు తోడు వయోభారంతో వచ్చే రుగ్మతలు కూడా నంది ఎల్లయ్య ప్రాణాలు హరించేందుకు కారణంగా మారాయి, చికిత్సకు ఆయన శరీరం కూడా సహకరించకపోవడంతో ఆయన ఇవాళ ఉదయం మరణించారు.

ఆరుసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు. సిద్దిపేట నుంచి ఐదుసార్లు, నాగర్ కర్నూల్‌ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. యావత్ దేశం నరేంద్రమోడీ మ్యానియాకు లోంగి ఆయనను ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న తరుణంలోనూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నంది ఎల్లయ్య మాత్రం విజయాన్ని అందుకున్నారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొన్నాళ్లు ఎమ్మెల్సీగానూ సేవలందించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. నంది ఎల్లయ్య మృతిపట్ల పలు పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.

నంది ఎల్లయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్దతతో క్రమశిక్షణతో నంది ఎల్లయ్య పనిచేశారన్నారు. ఆయన క్రమశిక్షణ నేటి తరానికి ఆదర్శం. ఓటమి ఎరగని నేత, దళిత బాంధవుడు నంది ఎల్లయ్య. గాంధీ ఆశయాలను తుచ తప్పకుండా పాటించిన ఆదర్శ నాయకుడని కోనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుని పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles