Not appropriate time on 3 capital: Pawan Kalyan 3 రాజధానులపై నిర్ణయానికి సమయం కాదు: పవన్ కల్యాణ్

Pawan kalyan feels not appropriate time to take decision on 3 capitals

amaravati, Pawan Kalyan, Janasena, appropriate time, Historical blunder, dark day, BB Harichandan, Andhra Pradesh, andhra pradesh 3-capital plan, Andhra Pradesh Reorganisation Act, andhra pradesh reorganisation bill, andhra pradesh, Chandrababu Naidu, Jagan Mohan Reddy, Biswa Bhusan Harichandan, andhra pradesh governor, A.P. Capital Region Development Authority Repeal Bills, A.P. governor, A.P. CRDA Repeal Bills, Governor approves three capitals, CM Jagan, Andhra Pradesh, politics

Actor turned Politician Janasena Party (JSP) President Pawan Kalyan on Friday said its not the appropriate time on the governor's decision on decentralisation of the state Pradesh administration and the cancellation of Capital Region Development Authority (CRDA) Bill.

మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం కాదు: పవన్ కల్యాణ్

Posted: 08/01/2020 02:10 AM IST
Pawan kalyan feels not appropriate time to take decision on 3 capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఇవాళ కీలక పరిణామానికి తెరలేపడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ పార్టీలో అలర్ట్ అయ్యాయి. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో పార్టీలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి, ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. ఈ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. ఆయనతో పాటు అమరావతి జేఏసీ కూడా ఇదే తరహాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించింది.

ఇదే సమయంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇలాంటి కీలక అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేని, నిరసనలు తెలుపలేని సంకటకర పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయంలో ఉందని, అయితే రాష్ట్రంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతూ తన ఉద్దృతిని అంతకంతకూ విస్తరించుకుంటూ వ్యాప్తిని చెందుతున్న తరుణంలో ఇలాంటి కీలక బిల్లులపై నిర్ణయాలు తీసుకోవడం సముచిత సమయం కాదని అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని అన్నారు. రాష్ట్రంలో రోజుకు పదివేల కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయని, దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయాందోళనతో బతుకుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పాలన వికేంద్రీకరణపై కాకుండా ప్రజలను రక్షించడానికి రాష్ట్ర మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలానే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలిపన నేపథ్యంలో రాజధాని రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్‌ ప్రణాళిక రూపొందిస్తామని పవన్‌ తెలిపారు. రైతుల కోసం జనసేన తుది వరకు పోరాడుతుందని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles