Andhra Pradesh's three-capital bills get governor's assent మూడు రాజధానులకు గవర్నర్ అమోదం..

Governor bb harichandan approves three capital plan for andhra pradesh

Biswa Bhusan Harichandan, andhra pradesh governor, A.P. Capital Region Development Authority Repeal Bills, A.P. governor, A.P. CRDA Repeal Bills, Governor approves three capitals, CM Jagan, Andhra Pradesh, Crime

In a major turning point in the history of Andhra Pradesh, Governor Biswa Bhusan Harichandan on Friday gave his assent to the A.P. Decentralisation and Inclusive Development of All Regions and A.P. Capital Region Development Authority Repeal Bills - 2020.

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ అమోదం..

Posted: 08/01/2020 12:06 AM IST
Governor bb harichandan approves three capital plan for andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామానికి ఇవాళ నాంది పడింది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రకరణకు ఇవాళ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదం పోందాయి. ప్రభుత్వం మూడు వారాల కిందట ఈ బిల్లులను గవర్నర్‌ హరిచందన్ కు పంపించి అమోదం కోసం వేచి చూశాయి, కాగా ఇవాళ శ్రావణ శుక్రవారం రోజున అందులోనూ వరలక్ష్మీ వత్రం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ఆ బిల్లుకు అమోదం తెలిపారు. దీంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు ఈ బిల్లులపై న్యాయ శాఖ అధికారులతో గవర్నర్‌ సంప్రదింపులు జరిపారు. అనంతరం వీటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. దీంతో మరోమారు శాసన మండలి ఏర్పాటు అయ్యేవరకు వేచి చూడని ప్రభుత్వం.. ఈ బిల్లలపై పునరాలోచన చేసి ఏకంగా గవర్నర్ అమోదానికి పంపింది. దీంతో ఈ బిల్లులను మూడు వారాల పాటు పెండింగ్ లో పెట్టిన గవర్నర్ న్యాయసలహాలు తీసుకున్న తరువాత వాటిని ఇవాళ అమోదించారు.

శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, మండలి ఆమోదంతో సంబంధం లేకుండా నెల రోజులకు ఆటోమేటిక్‌ ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదిస్తోంది. కాగా గత నెల 17న మండలికి పంపిన ఈ బిల్లులకు ఈనెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావించింది. దీంతో తుది ఆమోదానికి గవర్నర్‌కు పంపారు. గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి ఛైర్మన్‌ అప్పట్లో సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో వేర్వేరు‌ పిటిషన్లు దాఖలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles