Ashok Gehlot meets Governor Kalraj Mishra again మళ్లీ అసెంబ్లీ సమావేశం కుదరదన్న గవర్నర్..

Governor snubs ashok gehlot for 3rd time over assembly session demand

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Rajasthan Governor Kalraj Mishra rejected Chief Minister Ashok Gehlot's request for an assembly session for the third time. There seemed to be no convincing reason to call a session on Friday, without a 21-day notice in the middle of the coronavirus pandemic, the Governor said.

రాజస్థాన్ సంక్షోభం: మూడో పర్యాయం అసెంబ్లీ సమావేశం కుదరదన్న గవర్నర్..

Posted: 07/29/2020 08:16 PM IST
Governor snubs ashok gehlot for 3rd time over assembly session demand

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితిని ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో.. ఆయనను అధికార పీఠంపై నుంచి కిందకు లాగేందుకు ఇటు సొంత పార్టీకి చెందిన రెబల్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఓ వైపు.. అటు బీజేపి పార్టీకి చెందిన ప్రముఖుుల మరోవైపు ఎవరి ప్రయత్నాలను వారు కోనసాగిస్తున్నారు. ఇక వీరి ఆటలకు గవర్నర్ తిరస్కారాలు కూడా కలిస్తే.. ఎపుడు ఏం జరుగుతుందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో తన బలనిరూపణకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న గెహ్లాట్ విన్నపాన్ని ముచ్చటగా మూడో పర్యాయం కూడా తిరస్కరించారు గవర్నర్ కాల్ రాజ్ మిశ్రా.

రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారం డోలాయమానంలో పడిన సంగతి తెలిసిందే. సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేసిన తర్వాత రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఎవరు తమకు అనుకూలంగా మార్చుకుంటారో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే బీఎస్సీ ఎమ్మెల్యేల మద్దతును ఉపసంహరించుకునేలా అధినేత్రి మాయావతి హుకుం జారీ చేయగా, వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయవంతమయ్యారు గెహ్లాట్. వీరి మద్దతుతో ప్రస్తుతానికి గెహ్లాట్ ప్రభుత్వానికి... మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక్క ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నారు. దీంతో ఆయన తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారితే... కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆశల వలయంలో ప్రత్యర్థి వర్గాలువున్నాయి. ఈ నేపథ్యంలో, అసెంబ్లీని సమావేశపరిచి... బలాన్ని నిరూపించుకుని, అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో గెహ్లాట్ ఉన్నారు. అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ఇప్పటికి మూడు సార్లు గవర్నర్ కు విన్నవించారు. కానీ, ఇంత వరకు ఆయన కనికరించలేదు. కరోనా నేపథ్యంలో ఇప్పటికిప్పుడే సమావేశాలను ఏర్పాటు చేయలేమని గవర్నర్ చెపుతున్నారు. ఎమ్మెల్యేలకు కనీసం 21 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ను కలిసేందుకు గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ కు ఏం కావాలో తెలుసుకునేందుకు తాను రాజ్ భవన్ కు వెళ్తున్నానని చెప్పారు. 21 రోజులు కాకపోతే 31 రోజులు తీసుకున్నా పర్వాలేదని... అంతిమ విజయం తమదేనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles