UTMS to be ready with DPR by year-end మెట్రో కారిడార్ కు శరవేగంగా అడుగులు..

Metro rail project to transform vizags public transport system

Greenfield international airport, Visakhapatnam, Vizag's public transport system, vizag, rail, public transport, metro rail project, Metro, Andhra Pradesh

The proposed 140km-long mass rapid transit system is slated to change the public transport system in Vizag forever. The DPR for the 60km-long tram network will be completed by December. Even though the initial DPR was prepared for only 42.55km, the state government has decided to extend the corridors considering the new Greenfield international airport coming up at Bhogapuram.

మెట్రో కారిడార్ కు శరవేగంగా అడుగులు.. రూ.16వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్

Posted: 07/29/2020 08:48 PM IST
Metro rail project to transform vizags public transport system

విశాఖ వీధుల్లో మెట్రో రైలు పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే లైట్ మెట్రో, ట్రామ్‌ కారిడార్ లకు సంబంధించిన డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ నిమగ్నమైంది. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ బిజీగా ఉంది. లైట్‌ మెట్రోకు సంబంధించిన డీపీఆర్ ని నవంబర్‌ నాటికి, ట్రామ్‌ కారిడార్ కు సంబంధించిన డీపీఆర్‌ని డిసెంబర్‌ నాటికి ప్రభుత్వానికి సమర్పించేందుకు యూఎంటీసీ సిద్దమవుతోంది. విశాఖ నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్‌ కదులుతుందన్న అంచనాలతో.. మెట్రో కారిడార్‌ రూట్ మ్యాప్ రూపోందుతోంది. ఇక ఈ మార్గాలలో జరుగుతున్న అభివృద్ధి.. మరో పాతిక, ముఫ్సై ఏళ్ల తరువాత పరిస్థితులను, ట్రాఫిక్ ను అంచనా వేసుకుని డీపీఆర్ రూపొందిస్తున్నారు.

ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పనులు కూడా వేగాన్ని అందుకున్నాయి. కిలోమీటరు మేర లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తుండగా.. ట్రామ్‌ కారిడార్ కు రూ.100 నుంచి రూ.120 కోట్లుగా భావిస్తున్నారు. లైట్‌ మెట్రోరైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్ లకు సంబంధించిన డీటైల్డ్ ఫ్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ సిద్ధం చేస్తోంది. లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్ కు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్ ను అప్ డేట్‌ చేస్తూ.. 79.91 కి.మీకు సంబంధించిన డీపీఆర్‌ను రూ.5.34 కోట్లకు, 60.20 కి.మీ పొడవున్న ట్రామ్‌ కారిడార్ కు సంబంధించిన డీపీఆర్ ను రూ.3.38కోట్లకు అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది.

ఈ మేరకు రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన డీపీఆర్‌ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్ ల రూట్ మ్యాప్ లను సిద్దం చేయనుంది. 2020 చివరి నాటికల్లా లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి కానున్నాయి. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ పూర్తి చేస్తాం. జూన్‌ 2021 నాటికి లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభిస్తాం. మార్చి 2024 నాటికి లైట్‌ మెట్రోలో ఒక కారిడార్‌ నుంచి ప్రయాణాలు ప్రారంభించేలా.. మెట్రోరైలు ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఇవీ అంచనాలు:

 

లైట్‌ మెట్రో డీపీఆర్‌ పూర్తయ్యే సమయం – 2020 నవంబర్‌

కిలోమీటర్‌ నిర్మాణానికి లైట్‌ మెట్రోకు అయ్యే ఖర్చు – సుమారు రూ.200 కోట్లు

ట్రామ్‌ కారిడార్‌ డీపీఆర్‌ పూర్తయ్యే సమయం – 2020 డిసెంబర్‌

కిలోమీటర్‌ నిర్మాణానికి ట్రామ్‌ కారిడార్‌కు అయ్యే ఖర్చు – సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు

అగ్రిమెంట్‌ పూర్తి చేసుకునే సమయం – మార్చి 2021

లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభించే సమయం – జూన్‌ 2021

విశాఖ వీధుల్లో మొదటి మెట్రో సర్వీసు ప్రారంభమయ్యే సమయం – మార్చి 2024

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles