Fire breaks out at Visakhapatnam's pharma city రాంకీ సాల్వెన్సీ పరిశ్రమలో రియాక్టర్ల పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు

Major fire mishap at visakha solventss plant in vizag pharma city

Parawada Pharma City, Parawada Pharma City fire, jn pharma city fire, jn pharma city blast, Parawada Pharma City blast, Visakha Solvents blast, Blast at Visakha Solvents, visakha solvents, vizag fire, pharma city, visakhapatnam, Andhra Pradesh, politics

A major fire broke out in chemical manufacturer Visakha Solvents Ltd's plant in the Pharma City, Parawada, Visakhapatnam. As per the information available with police and revenue officials, a series of blasts led to a major fire in the plant around 11 pm on Monday.

రాంకీ సాల్వెన్సీ పరిశ్రమలో రియాక్టర్ల పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు

Posted: 07/14/2020 12:50 AM IST
Major fire mishap at visakha solventss plant in vizag pharma city

విశాఖపట్న వాసులను వరుసగా ప్రమాదాలు పలకరిస్తున్నాయి. ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో సంభవించిన ప్రమాదంతో నెలకోన్న విషాద ఛాయలనే ఇంకా విశాఖవాసులు మర్చిపోలేకపోతున్నారు, ఈ తరుణంలో మరో గ్యాస్ లీక్, ఆ తరువాత ఇప్పుడు తాజాగా మరో అగ్ని ప్రమాదం విశాఖ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది, పరవాడలోని జవహరలాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ ఎస్‌ఈటీపీ సాల్వెంట్‌ ఫార్మాకంపెనీలో భారీపేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు, సంస్థ సిబ్బంది భయాందోళనలు చెందుతున్నారు.

రాంకీ సాల్వెంట్ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. పలుమార్లు పేలుళ్లు సంభవిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది సమీపంలోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి దూరంగా నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. సమీపంలోని కంపెనీలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని పరిసర కంపెనీల సిబ్బంది, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రతి రోజు మాదిరిగానే రాత్రి పది గంటలకు నైట్‌ షిఫ్ట్‌ మొదలైన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల రసాయన వాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన సాయినాథ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం. పరవాడ ఫార్మాసిటీలోని వేరువేరు కంపెనీలో మందులు తయారు చేసే క్రమంలో వచ్చే ఒక రకమైన వృథా ఆయిల్ ను తిరిగి శుభ్రం పరిచే ప్రక్రియ ఈ కంపెనీలో జరుగుతుంది. కాగా ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గాయపడినట్లు సమాచారం. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles