One dead in fire mishap at Visakha Solvents plant పరవాడ రియాక్టర్ల పేలుడు ఘటనలో ఒకరి మృతి.? నలుగురికి గాయాలు

One dead in fire mishap at visakha solvents plant in vizag pharma city

Srinivasa Rao, senior chemist, mallesh, Parawada Pharma City, Parawada Pharma City fire, jn pharma city fire, jn pharma city blast, Parawada Pharma City blast, Visakha Solvents blast, Blast at Visakha Solvents, visakha solvents, vizag fire, pharma city, visakhapatnam, Andhra Pradesh, politics

Senior chemist Srinivasa Rao is found dead with full burnt body, his family members had identified his body after a major fire broke out in chemical manufacturer Visakha Solvents Ltd's plant in the Pharma City, Parawada, Visakhapatnam.

పరవాడ రియాక్టర్ల పేలుడు ఘటనలో సీనియర్ కెమిస్ట్ మృతి.? నలుగురికి గాయాలు

Posted: 07/14/2020 12:09 PM IST
One dead in fire mishap at visakha solvents plant in vizag pharma city

(Image source from: Twitter.com/ANI)

విశాఖపట్నంలోని పరవాడ ఫార్మసీటి పరిథిలోని రాంకీ ఎస్‌ఈటీపీ సాల్వెంట్‌ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీపేలుళ్ల ఘటనలో సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి చెందారు. పేలుళ్ల కారణంగా నిన్న రాత్రి భారీగా మంటలు ఎగసిపడగా.. విధులకు హాజరైన సీనియర్ కెమిస్ట్ కాండ్రేగుల శ్రీనివాసరావు పరిశ్రమ నుంచి బయటకు రాలేదు. దీంతో ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు కంపెనీ వద్దనున్న పోలీసులకు పిర్యాదు చేశారు. పరిశ్రమ వద్ద ప్రమాదం ఘటన సమాచారాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఆరా తీసారు. అయితే ఆయన ఆచూకీ లభ్యం కాలేదని రాత్రి అధికారులు తెలిపారు.

కాగా ఇవాళ ఉదయం పరిశ్రమ శిధిలాలను తొలగిస్తున్న క్రమంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి.. తీవ్రంగా రుధిర గాయాలైన స్థితిలో వుండి. అయితే శ్రీనివాస రావు మరణాన్ని ఇంకా కంపెనీ యాజమాన్యం కానీ, పోలీసులు కానీ ధృవీకరించలేదు. దీంతో సాల్వెంట్ పరిశ్రమ వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి, ఇక ఇదే సంస్థలో పనిచేస్తున్న మరో కార్మికుడు మల్లేష్ గాజువాకలోని ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగానే వుంది. మరో ముగ్గురు కార్మికులకు కూడా గాయాలయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో ముగ్గురే కార్మికులు వున్నారని చెప్పిన యాజమాన్యం.. సంస్థలో ఐదుగురిపైగా సిబ్బంది వున్నారని తెలిపింది.

సంస్థలో రెండో షిప్టులో ఏకంగా పదిహేను మంది సిబ్బంది పనిచేస్తుంటారని కార్మిక వర్గాల సమాచారం, అయితే నిన్నటి రోజున ఎంత మంది కార్మికులు విధులకు హాజరయ్యారన్న విషయమై యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా సంస్థలో సంభవించిన పేలుడు ఘటనలో ఏకంగా 15 నుంచి 20 రసాయన డ్రమ్ములు పేలాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి, యాజమాన్యం వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles