ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేత, వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తాను విక్రయించిన విల్లా అధునీకరణ విషయంలో కొనుగోలుదారుల ఇంటిలోకి చోరబడి వారిని భయభ్రాంతులకు గురిచేసి.. దౌర్జన్యం చేసిన కేసులో పీవీపిని అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీపీ నుంచి విల్లాను ఖరీదు చేసిన పోరుగింటివారు ఆయనపై బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తనను అరెస్టు చేయకుండా పివీపీ రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఆయనను అరెస్టు చేయవద్దని అదేశాలను జారీ చేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఆనయను అరెస్టు చేయకుడదని న్యాయస్థానం తమ ఉత్తర్వులలో పేర్కోంది. దీంతో పోరుగింటి వారిపై దౌర్జన్యం సహా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులలో ఆయన తాత్కాలిక ఊరట లభించింది.
తన ఇంటి పొరుగున విల్లాలో నివాసముంటున్న యజమానిపై దౌర్జన్యం చేసి వారి ఇంట్లోకి తన మనుషులతో కలిసి హల్చల్ చేసిన కేసులో పోలీసులు ఆయనపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన క్రమంలో తొలిరోజు విచారణకు హాజరైన పీవీపీ రెండో రోజు డుమ్మాకోట్టాడు. దీంతో ఆయనను విచారించేందుకు ఆయన నివాసానికి వెళ్లగా వారిని లోనికి ప్రవేశించకుండా ఆయన తన పెంపుడు కుక్కలను పోలీసులపైకి ఉసిగొల్పాడు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కల్గించడంతో పీవీపీపై పోలీసులు మరో కేసును కూడా నమోదు చేశారు.
పోలీసుల అధికారుల విచారణను అడ్డుకునేందుకు, వారిపై దాడి, లేదా విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించనందుకు గాను ఆయనపై పోలీసులు 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని కోరడంతో న్యాయస్థానం పీవీపీ బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈకేసుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
May 17 | హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ... Read more
May 17 | కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి... Read more
May 17 | ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి... Read more
May 17 | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు... Read more
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more