AP DGP says restrictions will be continued అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు ఇవే: రాత్రిపూట కర్ప్యూ యధాతథం..

Dgp gautam sawang clears air on interstate arrivals says restrictions will be continued

covid-19, coronavirus, AP DGP, Gautam Sawang, restrictions on travel, permissions, neighbouring states, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

DGP Gautam Sawang said that the restrictions would continue over the permission of people from neighbouring states entering into Andhra Pradesh. The DGP told that the checkpoints will continue at the state borders in the wake of coronavirus cases.

అన్ లాక్ 2.0 మార్గదర్శకాలకు ఏపీలో బ్రేక్.. అనుమతి తప్పనిసరి..

Posted: 07/01/2020 03:16 PM IST
Dgp gautam sawang clears air on interstate arrivals says restrictions will be continued

(Image source from: Hmtvlive.com)

ధేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. దేశ్యవ్యాప్తంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనుమతులు లభించింది. ఇక రాత్రి పూట ప్రయాణాలు చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోకూడదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కోంది. అయితే ఈ అదేశాలను ప్రామాణికంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణాలు సాగించాలని భావిస్తే మాత్రం అది చెల్లబాటు కాదని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులపై రాకపోకలకు ఎలాంటి అనుమతుుల అవసరం లేదని కేంద్రం అదేశాలిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇవి అమలు కావని అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి తప్పనిసరని తాజాగా ఏపీ హోంశాఖ అధికారులు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఈ విషయంలో మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రరాష్ట్రంలోకి వచ్చే వారిని అనుమతించే విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా కోవిడ్ ప్రభావం అధికంగా వున్న రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు కోనసాగుతాయిన స్పష్టం చేశారు. అటు తెలంగాణ నుంచి వచ్చేవారిపై కూడా ఈ అంక్షల ప్రభావం వుంటుందని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను యధాతథంగా కొనసాగించేటట్లు డీజీపీ  వెల్లడించారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి  సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అనుమతిస్తామని తెలిపారు. 

రాష్ట్రంలోకి రావాలంటే తప్పనిసరిగా అనుమతి పోందాల్సిన అవసరం వుందని ( కోవిడ్ పర్మిట్ పాస్‌) తీసుకోవాలని, పాస్‌ ఉన్నవారిని ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకే అనుమతిస్తామని చెప్పారు. రాత్రిపూట అనుమతి లేదని,  రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.  స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌(అనుమతి) పొందాలని సూచించారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు.  నిన్న ఉదయం నుంచి పాసులు లేకుండా ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వందలాది మందిని పోలీసులు వెనక్కి పంపించారు. రాత్రి 7గంటలు దాటిన తర్వాత పాసులు ఉన్న వారిని అనుమతించకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles