Google Pay Is Not Banned: NPCI Clarifies గూగుల్ పే పై బ్యాన్.. వ్యతిరేకతతో దిగివచ్చిన ఎన్సీపీఐ

Google pay is not banned but is authorised and protected by law npci clarifies

gpay banned by rbi google pay authorised clarifies npci google pay,npci,national payments corporation of india,rbi,reserve bank of india,digital payments,upi,unified payments interface, g pay, npci, rbi, google pay, loans, merchants, digital payments, unified payments, tpap economy, finance

Google Pay is not banned in India, clarified the National Payments Corporation of India (NPCI). RBI has authorised NPCI as a Payment System Operator (PSO) of UPI and NPCI in its capacity as PSO authorises all UPI participants. We would like to clarify that Google Pay is classified as Third Party App Provider (TPAP)

గూగుల్ పే పై బ్యాన్.. సోషల్ మీడియాలో వ్యతిరేకతతో దిగివచ్చిన ఎన్సీపీఐ

Posted: 06/27/2020 12:03 AM IST
Google pay is not banned but is authorised and protected by law npci clarifies

దేశంలో పెద్ద నోట్ల రద్దు చేసి.. వాటి స్థానంలో అంతకన్నా పెద్ద నోటును తీసుకువచ్చిన భారతీయ రిజర్వు బ్యాంకు.. ఆనాటి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలను అధికంగా ప్రోత్సహిస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి. ఈ క్రమంలో అందివచ్చిన స్మార్ట్ ఫోన్లు, దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్ యాప్ లు కూడా ఈ లావాదేవీలకు ప్రోత్సహిస్తున్నాయి. వీటిలో ఇలా వచ్చి.. అలా ఎదిగిపోయిన డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ పే.. గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ తప్పనిసరిగా మారిపోయింది. ఇక తాజాగా డబ్బులను క్షణాల్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు ట్రాన్సఫర్ చేస్తున్న ఈ యాప్ తాజాగా చిన్న, మధ్యస్థ వ్యాపారాలు చేసేవారికి కూడా అప్పులను అందజేస్తామని ప్రకటించింది.

ఇలా ప్రకటించిన 24 గంటల వ్యవధిలో గూగుల్ పపే యాపైపై భారతీయ రిజర్వు బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్ కాదని.. దానిపై నిషేధం విధించింది. అంతే క్షణాల ఆలస్యం కూడా లేకుండానే నెటిజనుల నుంచి ఆర్బీఐ పెద్దఎత్తున విమర్శలను ఎదుర్కోంది. ఆర్బీఐ గూగుల్ పేను బ్యాన్ చేసిందన్న యాష్ ట్యాగ్ నెట్టింట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. దీంతో మునుపెన్నడూ ఇంతలా విమర్శలను చవిచూడని భారతీయ రిజర్వు బ్యాంకు ఒక్కసారిగా దేశవ్యాప్త నెటిజనుల నుంచి విమర్శలను ఎదుర్కోవడంతో యూపీఐతో డిజిటల్ లావాదేవీల వ్యవహరాలను పర్యవేక్షించే  నేషనల్ పేమెంట్‌ అండ్ సెటిల్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఫీసీఐ )ని రంగంలోకి దింపింది.

విమర్శలు మరింత తీవ్ర స్థాయికి చేరుతున్న క్రమంలో ఎన్ఫీసీఐ తెరపైకి వచ్చింది విమర్శలకు చెక్ పెట్టింది. గూగుల్ పే (జీపే)పై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. గూగుల్ పే తమ అధీకృతచెల్లింపుల జాబితాల వుందని, సురక్షితమైందని అందులో పేర్కొంది. ‘‘జీపేని ఆర్బీఐ యూపీఐ, ఎన్పీసీఐ పేమెంట్స్ సిస్టం ఆపరేటర్ గా (పీఎస్‌వో)గా గుర్తించింది. జీపే లాంటి సంస్థలు పీఎస్వోలకు యాప్‌ ప్రొవైడర్లుగా వ్యవహరిస్తాయి. అలానే జీపే చట్టపరంగా పూర్తిగా సురక్షితమైంది. జీపేని థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్ ‌(టీపీఏపీ)గా వర్గీకరించాం. ఇది యూపీఐ చెల్లింపులు, బ్యాంకింగ్ భాగస్వాముల ద్వారా పనిచేస్తుంది ’’అని తెలిపింది. అలానే ఎన్పీసీఐ గుర్తింపు పొందిన టీపీఏపీలు పూర్తిగా సురక్షితమైనవి స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : g pay  npci  rbi  google pay  loans  merchants  digital payments  unified payments  tpap economy  finance  

Other Articles