Don't Be Afraid, Prime Minister: Rahul Gandhi 'సైనికుల మరణాలపై ఏం దాస్తున్నారు' ప్రధానికి రాహుల్ ప్రశ్న

Speak the truth rahul gandhi to pm modi in latest attack on chinese intrusion

Rahul Gandhi, PM Modi, Narendra Modi, China Incursion, Indian soilders, chinese troops, Ladakh, India China

Congress leader Rahul Gandhi renewed his attack on Prime Minister Narendra Modi and his government over the clash with Chinese forces in Ladakh last week in which 20 Indian soldiers lost their lives, asking him to 'speak the truth without being afraid' whether China had occupied Indian territory.

‘‘సైనికుల మరణాలపై ఏం దాస్తున్నారు’’ ప్రధానికి రాహుల్ ప్రశ్న

Posted: 06/27/2020 12:33 AM IST
Speak the truth rahul gandhi to pm modi in latest attack on chinese intrusion

గల్వాన్‌ వ్యాలీలోని సైనికుల మరణం, భారత భూభాగం విషయానికి సంబంధించిన ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజల వద్ద నిజాలను దాస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. యావత్ దేశంలో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మీకు అండగా వుంటూ చైనా దళాల కుట్రను, ముక్తకంఠంతో ఖండిస్తూన్న తరుణంలోనూ ప్రధాని నిజాలను బయటపెట్టడం లేదని ఆన్నారు. భారత భూభాగంలోకి చైనా దళాల చొరబాటు, సైనికులపై దాడి ఘటనపై ఇవాళ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించారు. భారత భూభాగంలోకి చైనా దళాలు ప్రవేశించకపోతే ఘర్షణలు ఎలా జరిగాయని 20 మంది సైనికులతో సహా ఓ కమాండింగ్ అధికారి ఎలా మరణించారని ప్రశ్నించారు. ఘటనపై ఇప్పటికైనా నిజాలు చెప్పాలని ప్రధాని మోడీని డిమాండ్‌ చేశారు.

తూర్పు లడాఖ్ లోని గల్వాన్‌ వ్యాలీలో జూన్ 15న భారత్‌, చైనా దళాల మధ్య హింసాత్మక ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ఒక అంగుళం భారతీయ భూమిని కూడా ఎవరూ ఆక్రమించలేదని కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని చెప్పారు. కానీ భారత భూమిని చైనా మూడు ప్రాంతాల్లో ఆక్రమించిందని లద్దాఖ్‌ నివాసితులు, సైన్యం రిటైర్డ్ జనరల్స్ పేర్కొంటున్నారు. ఉపగ్రహ చిత్రాలు అలాగే చూపించాయి అని రాహుల్‌ ఓ ప్రసంగంలో పేర్కొన్నారు.

‘మా భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు’ అని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు ప్రస్తావించారు. ‘ప్రధానమంత్రి గారు.. మీరు నిజాలు మాట్లాడాలి. దేశానికి వాస్తవాలు చెప్పాలి. భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని మీరంటే అది వారికి లాభం చేకూర్చినట్లు అవుతుంది. మనం కలిసి పోరాటం చేసి వారిని తరిమేయాలి. అవును.. చైనా మన భూమిని స్వాధీనం చేసుకుందని, మేము చర్య తీసుకోబోతున్నామని భయపడకుండా మీరు నిజం మాట్లాడాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM Modi  China Incursion  Indian soilders  Ladakh  

Other Articles