ICICI Lombard allows claims for home treatment ఐసిఐసిఐ హెల్త్ ఇన్సూరెన్స్ తాజా మార్పులు..

Icici lombard allows claims for home treatment adds ncb benefit to existing healthcare plans

Coronavirus, COVID-19, insurance, ICICI Lombard, coronavirus insurance, ICICI lombard Covid Benifits, IRDAI, corona waiting period, new changes to Health policy, ICICI added benefits, ICICI Coronavirus Benefits, companies, business

In the light of coronavirus pandemic, ICICI Lombard, the country’s largest non-life insurer added more benefits for Covid-19 treatment to its existing healthcare insurance indemnity policies. It also reduced the waiting period for coronavirus-related claims to 15 days from 30 days earlier. It said the decreased cooling-off period for Covid-19 patients comes without any increase in premiums.

ఐసిఐసిఐ హెల్త్ ఇన్సూరెన్స్ తాజా మార్పులు.. ఇంటి చికిత్సకు క్లెయిమ్ వర్తింపు..

Posted: 06/17/2020 02:31 PM IST
Icici lombard allows claims for home treatment adds ncb benefit to existing healthcare plans

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇటీవలే టెలీ మెడిసిన్ సహా వరుసగా ఎనమిది సంవత్సరాలు భీమా కట్టిన వారి క్లెయిమ్ లను భీమా సంస్థలు సవాల్ చేయకుండా పలు సవరణలను తీసుకువచ్చింది. కాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చేసిన సూచనలు, సలహాలతో దేశంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ అగ్రగామి ఇన్యూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌ తమ హెల్త్ ఇన్యూరెన్స్ పాలసీల్లో పలు మార్పులను తీసుకువచ్చింది. కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వారికి వెయిటింగ్ పిరియడ్ ను నెల రోజుల నుంచి 15 రోజులకు తగ్గించినట్లు ప్రకటించింది.

అయితే ఈ వెయిటింగ్ పిరియడ్ అన్ని వ్యాధులకు కాకుండా కేవలం కరోనావైరస్ బాధితులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. మిగతా వ్యాధులకు 30 రోజుల నిర్ణీత వ్యవధి నిబంధన యధావిధిగా వర్తిస్తుందని పేర్కొంది. ఇక దీంతో పాటు ఏదైనా అనారోగ్యం బారినపడి, ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోనే వారికీ క్లెయిమ్ లను వర్తింపజేయనున్నామని తెలిపింది. హోం హెల్త్ కేర్‌ బెనిఫిట్‌ కింద చికిత్స ఖర్చులను కేవలం పక్షం రోజుల వ్యవధిలో చెల్లించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సోషల్ డిస్టెస్సింగ్ పాటించడం అనివార్యమైందని, దీంతో ఆసుపత్రులలో చేరకుండా పాలసీదారులు ఇంట్లో వుంటూనే చికిత్స చేయించకోవచ్చునని చెప్పింది. అయితే, మార్చి 31కి ముందు పాలసీలు తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది.

సంస్థ అందిస్తోన్న కంప్లీట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ బూస్టర్‌, హెల్త్ కేర్‌ ప్లస్ లతో పాటు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నింటిలోనూ కొవిడ్‌-19 చికిత్సకు పరిహారం ఇస్తున్నట్లు పేర్కొంది. దీనికోసం ఎలాంటి అదనపు ప్రీమియం వసూలు చేయడం లేదని వెల్లడించింది. కంప్లీట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ బూస్టర్‌ ప్లాన్లను ఎంచుకున్న వారు కొవిడ్‌-19 చికిత్సకు పాలసీని వాడుకున్నా.. ‘నో క్లెయిం బోనస్‌’ పై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మంత్రి తెలిపారు. కరోనాకు పరిహారం ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రీమియం పేంచే ఆలోచనేమీ లేదని పేర్కొన్నారు. కరోనా కోసం ప్రత్యేకంగా ఇప్పటికే కొవిడ్‌-19 ప్రొటెక్షన్‌ కవర్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి సులభంగా పాలసీ అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICICI Lombard  coronavirus insurance  ICICI lombard Covid Benifits  IRDAI  companies  business  

Other Articles