Covid 19: 351 fresh cases reported in AP ఏపీలో 7000 మార్కు దాటిన కేసులు.. 90 మరణాలు

Coronavirus in ap 351 new covid 19 cases state tally crosses 7000 mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 7000 Mark after 351 new cases were reported in the last 24 hours, out of which 2906 have so far recovered and have been discharged, while 90 have died, the state health department said.

ఏపీలో ఉదృతంగా కరోనా వ్యాప్తి.. 7000 మార్కు దాటిన కేసులు.. 90 మరణాలు

Posted: 06/17/2020 02:39 PM IST
Coronavirus in ap 351 new covid 19 cases state tally crosses 7000 mark

(Image source from: News18.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందకు పైగా ప్రజలను తన ప్రభావానికి గురిచేస్తోంది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు ఏడు వేల మార్కును దాటాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా రెండువందల సంఖ్యలో కరోనా కేసులు రాష్ట్రంలో నిర్థారణ అవుతున్నాయి, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత కొన్ని రోజులుగా వందకు పైగా నమోదువుతున్న కేసుల సంఖ్య గడిచిన 24 గంటల వ్యవధిలో మూడువందలకు పైగా కేసులు కావడం ఆందోళన వ్యక్తం అయ్యింది.

తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7వేల మార్కును దాటింది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 15,188 నమూనాలను పరీక్షించగా అందులో 351 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసులు మొత్తంగా 7071కి చేరాయి. అయితే ఇందులో విదేశాలకు, పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు చెందిన కేసులు 76గా నమోదయ్యాయి. రాష్ట్రంలో మాత్రం 275 కేసులు నమోదైనట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగతా కేసులు పలు జిల్లాల్లో్ వెలుగుచూసిన కాంట్రెక్టు కేసులని సమాచారం.

దీంతో ఇప్పటివరకు పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారితో కలపి 7071 మందికి కరో్నా వ్యాప్తి చెందినదని అధికారులు విడుదల చేసిన గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో మరణాలు కూడా క్రమంగా ప్రతీ రోజు నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఇద్దరు అసువులు బాసారు. వీరిలో ఒకరు కర్నూలు చెందినవారు కాగా, మరోకరు గుంటూరుకు చెందినవారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 90కి చేరింది. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2906కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 2559గా నమోదు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles