Anand Mahindra posts video of contactless delivery ఆనంద్ మహీంద్రాను ఆకర్షించిన బౌతిక దూరం ఐడియా..

Anand mahindra lauds liquor shops contactless pickup method

anand mahindra, mahindra, contactless pickup method, anand mahindra, anand mahindra liquor shop contactless delivery, anand mahindra twitter viral video, anand mahindra twitter trending, twitterities, liquor shop video, pickup method, viral video, video viral

Amid the coronavirus outbreak, as people across the world are being advised to maintain social distancing, a unique ‘Jugaad’ at an Indian liquor shop is winning the internet. Shared by Indian billionaire businessman Anand Mahindra, the one-minute-long video shows the entire money transaction that takes plays between the customer and the seller through a green plastic bottle that is sent back and forth via cardboard pipe.

ITEMVIDEOS: పారిశ్రామిక వేత్తను ఆకర్షించిన వైన్ షాపు బౌతిక దూరం ఐడియా..

Posted: 06/16/2020 05:19 PM IST
Anand mahindra lauds liquor shops contactless pickup method

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వాయువేగంతో ప్రపంచాన్ని చుట్టుముట్టి లక్షలాది మందిని తన ప్రభావానికి గురిచేసింది. అంతేకాదు దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలను కూడా కబళించివేసింది. కంటికి కనిపించని ఈ మహమ్మారి ఏ రూపంలో ఎక్కడి నుంచి వస్తుందో అన్న విషయం తెలియక యావత్ ప్రపంచంలోని ప్రజలందరూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఒక్కప్పుడు ఎంతటి బాధనైనా ఒక్క ఆత్మీయ కౌగిలి తీర్చేస్తుందన్న ప్రజలు.. ఇప్పుడు మాత్రం ఎంతటి ఆత్మీయులైనా బౌతిక దూరం పాటించాలనే కోరుతున్నారు. అయితే ఏ సమయంలోనైనా నీవు లేక నేను లేను.. అంటూ పాటను ఆలపించే మందుబాబులు యధావిధిగా మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు.

అసలే లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు కూడా మూసివేయడంతో అనేక ఇబ్బందులు పడ్డ మందుబాబులు.. తినేందుకు తిండి లేకపోయినా.. మందు లేక పోతే మాత్రం ఉండలేమన్నట్లు వ్యవహరిస్తున్నారు. భార్య పిల్లలు, కుటుంబ అన్న విషయాలు మందు తాగకముందు గుర్తు రావు.. మందు తాగిన తరువాత కూడా గుర్తుకు రావు.. అదేంట్రా అంటే మత్తు వదిలీవదలగానే తామేదో అన్యాయం చేశాసాం అన్న ఫీలింగ్ మాత్రం వీరిలో బాగానే వుంటుంది, అసలే పనులు లేక,. కుటుంబు అర్థాకలితో పూట తిని మరోపూట పస్తులుంటుంటే.. వీరు మాత్రం అందినకాడికి అప్పులు చేసైనా సరే వైన్ షాపుల్లో అటెండెన్స్ మాత్రం వేయించుకుంటున్నారు.

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలను తెరచి తెరువగానే జీవితంలో ఎన్నడూ ఎంతటి విపత్కర పరిస్తితుల్లోనూ క్యూలైన్లలో నిలబడని వారుకూడా ఏకంగా గంటల తరబడి నిల్చుని మరీ మద్యం సీసాలు కొన్నారు. ఈ సందర్భంలో కరువు తీరా తాగేందుకు ఏకంగా మద్యం దుకాణాల్లో యాభై వేల మందుకు కొనుగోలు చేశాడో ప్రబుద్దుడు. ఈ విషయాలను పక్కనబెడితే..  కరోనా టైంలో సోషల్ డిస్టెస్సింగ్ విధానాన్ని పాటిస్తూ ఓ మద్యం దుకాణం వ్యాపారి చేసిన ఐడియా ఏకంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేశారు.

అదేమంటే..‘‘కాంటాక్ట్ లెస్’’ బిజినెస్ ప్లాన్ వేశాడు. అంటే చేతులతో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటం..తరువాత మందుబాటిల్స్ ఇచ్చి పుచ్చుకోవటం కోసం షాపులోనుంచి బైటకు ఓ పొడవాటి గొట్టాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గొట్టంలోంచే డబ్బుల తీసుకోవటం.. మందు బాటిల్ లను ఓతాడుకు కట్టి ఆ గొట్టంలోంచి జార్చటం చేస్తున్నాడు.దీంతో తన వ్యాపారం సాగుతుంది..కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఉంది శభాష్ అంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఆ వైన్ షాప్ యజమాని ఐడియాను మెచ్చుకుంటూ దానికి సంబంధించిన ఓ వీడియోనుతన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలోచక్కటి స్పందన కూడా వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles