Delhi's health minister hospitalised due to fever హస్తిన ఆరోగ్యశాఖ మంత్రిలో కరోనా లక్షణాలు

Delhis health minister hospitalised due to fever undergoes covid test

Satyendar Jain, Delhi Health Minister, Satyendar Jain High fever, Satyendar Jain breathing trouble, Satyendar Jain corona symptoms, Jain Covid-19 sample, East Delhi, Arvind Kejriwal, Delhi CM, Quarantine, Isolations, New Delhi, Politics

Delhi Health Minister Satyendar Jain was admitted to hospital Monday night due to high fever and breathing trouble. Jain has been hospitalised in East Delhi's Rajiv Gandhi Super Specialty Hospital. Jain's Covid-19 sample has been taken on Tuesday morning and the results are still awaited.

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిలో కరోనా లక్షణాలు.. అస్పత్రిలో చేరిక

Posted: 06/16/2020 01:24 PM IST
Delhis health minister hospitalised due to fever undergoes covid test

దేశ రాజధాని నగరం ఢిల్లీలో క‌రోనా విజృంభన కోనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై తరువాత ఎవరైనా హస్తినలోనూ మహమ్మారి వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. దీని వ్యాప్తి బారిన తాజాగా ఢిల్లీఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ పడ్డారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అధికారులతో పంచుకున్నారు. నిన్న రాత్రి తాను తీవ్రజ్వరం,. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోన్నాడు, అయితే అవి కరోనా వైరస్ లక్షణాలుగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన హుటాహుటిన తూర్పు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు.

సోమవారం రాత్రి తాను స్థానిక ఆసుపత్రిలో చేరానని, ఆయన ఇవాళ ఉదయం తన పాలోవర్స్ తో విషయాన్ని పంచుకున్నారు. తనకు రాత్రి హై గ్రేడ్ జ్వ‌రం, ఆక్సిజ‌న్ స్థాయి అక‌స్మాత్తుగా ప‌డిపోవ‌డంతో..ఆసుప‌త్రిలో చేరారని పోస్టులో పెట్టారు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో హోం క్వారంటైన్ కు వెళ్లారు. తన ఇంట్లోనే ఆయన వుంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అయితే ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలు ఫలితాల్లో కరోనా నెటిగివ్ గా రావడంతో ఆయన అభిమానులు, పార్టీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ఆ పార్టీలోని ఇతర నేత‌ల్లో టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇక ఆయనతో పాటు కరోనా మహమ్మారిపై సమీక్షలకు హాజరైన రాష్ట్ర వైద్యశాఖ అధికారులు కూడా అందోళన చెందుతున్నారు. త‌మ‌కు ఎక్క‌డ సోకుతుందోన‌న్న భ‌యం వారిలో నెల‌కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారు హోం క్వారంటైన్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందా.? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. కాగా ఆసుపత్రిలో చేరిన మంత్రికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే స‌త్యేంద్ర జైన్ ఇటీవల కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్వ‌హించిన స‌మావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దీనికి  సీఎం కేజ్రీవాల్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు హజరయ్యారు. వీరంతా జైన్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles