India Definitely Not In Community Transmission: Centre కేసులు పెరుగుతున్నాయ్.. కానీ సమూహ వ్యాప్తి ఎక్కడా లేదు: కేంద్రం

India definitely not in community transmission centre amid spike in virus cases

community transmission, Coronavirus, Coronavirus India, Dr Balram Bhargava, ICMR DG Balram Bhargava, ICMR, AIIMS Delhi, National, Politics

India is 'definitely not' in the community transmission stage of the coronavirus pandemic, the government said today amid speculation over the past few days on the spike in cases in Mumbai and Delhi. The government also called the lockdown a success in checking the rapid spread of the virus.

కేసులు పెరుగుతున్నాయ్.. కానీ సమూహ వ్యాప్తి ఎక్కడా లేదు: కేంద్రం

Posted: 06/12/2020 12:40 AM IST
India definitely not in community transmission centre amid spike in virus cases

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దేశంలోనూ రోజురోజుకీ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదు కాగా, మార్చి వరకు నిరీక్షించిన కేంద్రం మార్చిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గాను లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ అన్ని రాష్ట్రాలు కూడా కఠినంగా అమలు చేశాయి. ఈ నేపథ్యంలో కరో్నా వ్యాప్తి నెమ్మదిగా విస్తరిస్తున్న తరుణంలో వైద్యఅరోగ్య అధికారులు సత్వర చర్యలు తీసుకుని వ్యాప్తిని నియంత్రించగలిగారు. దీంతో మే 18వ తేదీకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది.

ఇక అప్పటికే పలు విడతల లాక్ డౌన్ లు చూసిన ప్రజలు కుటుంబపోషణ నిమిత్తం రోడ్డు ఎక్కారు. అప్పటికే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు వ్యాపించడంతో.. సరిగ్గా పక్షం రోజలు అనగా జూన్ మాసం తొలినాళ్లకు చేరుకునే సమయానికి ఈ కేసుల సంఖ్య రెండు లక్ష్కల మార్కును అందుకున్నాయి. ఇక గత ఐదు రోజులుగా సాలీనా రోజుకు పది వేల కేసులు నమోదవుతూ దేశ ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇక అదే సమయంలో మరణాలు కూడా రోజుకు రెండవందలకు పైగా నమోదు కావడం దిగ్ర్భాంతిని కలిగించే అంశం.. అయితే ప్రజలు మాత్రం దీనిపై ఎలాంటి అందోళనకు గురికావాల్సిన పనిలేదని, అయితే అప్రమత్తంగా మాత్రం మెలగాల్సిందేనని కేంద్రం సూచిస్తో్ంది.

కరోనా మహమ్మారి కేసుల సంఖ్య దేశంలో పెరుగుతున్న మాట వాస్తవమే అన్ని కేంద్రం.. దీనిని బట్టి దేశంలో కరోనా సామూహ వ్యాప్తి దశకు మాత్రం చేరలేదని వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, తమిళనాడు, గుజరాత్, రాజఃస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుదల నేపథ్యంలో సామూహిక వ్యాప్తికి సంబంధించి వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ‘ఈ పదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డబ్ల్యూహెచ్ఓ దాన్ని నిర్వచించలేదు. కరోనా వ్యాప్తి దేశంలో చాలా తక్కువగా ఉంది. అది 1శాతం కంటే కూడా తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాలు, కంటైన్‌మెంట్ జోన్లలో కొంచెం ఎక్కువగా ఉంది. మనం కచ్చితంగా సామూహిక వ్యాప్తి దశలో లేము’ అని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్ బలరాం భార్గవ అన్నారు.

మహమ్మారికి మూడో దశనే సామూహిక వ్యాప్తి అంటారు. అది వైరస్‌ సోకడానికి కారణమైన మూలాన్ని గుర్తించలేని స్థితి. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కేసుల సంఖ్య పెరగడంతో సామూహిక వ్యాప్తి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దిల్లీలో నమోదవుతోన్న చాలా కేసులకు మూలాన్ని గుర్తించడం సాధ్యం కాలేదని, రాజధాని నగరం సామూహిక వ్యాప్తి దశలో ఉందా? అనే అంశంపై కేంద్రమే ప్రకటన చేస్తుందని సోమవారం దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles