Naked lockdown protest after virus strips them of income ఉద్యోగాలు పోతున్నాయని నగ్న ప్రదర్శన.. ఆదాయమే జీవితమా..!

Russian chefs in naked lockdown protest after virus strips them of income

naked protest, russian chefs, russian restaurants owners, hospitality business, russian government, income, social media, coronavirus, RUSSIA, NAKED protest, CHEFS, Russia, Social Issues, Health, Medicine, Living, Lifestyle, CIS Countries, Central Eastern Europe, General News, East European Countries, Europe

Russian restaurant owners stripped of their income by the coronavirus lockdown are campaigning for their businesses to be allowed to reopen by posting pictures of themselves naked on social media. Their demand is for authorities to allow them to start serving clients as the country gradually eases measures to stop the spread of the coronavirus.

ఉద్యోగాలు పోతున్నాయని నగ్న ప్రదర్శన.. ఆదాయమే జీవితమా..!

Posted: 06/12/2020 12:46 AM IST
Russian chefs in naked lockdown protest after virus strips them of income

బతికుంటే బలిశాకులు తిని బతకోచ్చు కానీ.. ప్రాణమన్నదే లేకపోతే ఎలా.. అనే వారి సంఖ్య తక్కువగా వున్న ఈ రోజుల్లో.. బతికివున్నామంటే సరిపోదు.. ఉన్నా.. లేకపోయినా తన కుటుంబానికి తాను నిత్యం భరోసాగా వుండాలన్నదే జీవితపరమార్థం అన్నవారి సంఖ్య అధికంగా వుంది. కరోనా వైరస్ ప్రభావంతో తమవారి జీవితాలే తలకిందులవుతున్నాయని కొందరు అంటుంటే.. కరోనా మహమ్మారి వల్ల తమ ఉద్యోగాలు పోతున్నాయని మరికొందరు అంగలార్చతున్నారు. ఇప్పటికే ప్రపంచాన్ని మార్చేసిన మహమ్మారి ప్రపంచంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే అన్నింటికంటే ముఖ్యంగా అతిధ్యరంగంపై తిరుగులేని ప్రభావాన్ని చాటిందన్నది అంగీకరించవల్సిన సత్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఛాయ్ కేఫ్ లు ఇలా తినుబండారాలపై మాత్రం కరోనా మహమ్మారి ప్రభావం అథికంగా వుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మందికి పైగా నిరుద్యోగులుగా మారారని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రష్యాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రష్యాలోని బార్లు, రెస్టారెంట్లు, కెఫేల యజమానులు, షెఫ్ లు కనీస నెలవారీ ఆదాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రష్యాకు చెందిన ఛెఫ్, హోటళ్ల సిబ్బంది, కార్మికులు అందరూ ఏకంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనను తెలిపారు.

ఇప్పుడు వీరంతా తమ నిరసనలను వినూత్నంగా తెలుపుతూ, అందుకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. అతిధ్యరంగాన్ని కరోనా దెబ్బతీసిందని, ఇక ఇప్పట్నించీ తాము మళ్లి పుంజుకోకపోతే తాము రోడ్డున పడాల్సివస్తుందని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేశారు. అయితే ఇదివరకే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన వారు వినూత్నంగా నగ్న ప్రదర్శనలతో తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. అయితే, పూర్తి నగ్నంగా కాకుండా, ప్లేట్లు, కప్పులు, బాటిళ్లు, కుర్చీలను కాస్తంతా అడ్డుగా పెట్టుకున్నారు లెండి. తమకు పని కల్పించాలన్నదే ఇప్పుడు వారి డిమాండ్. వీరిని చూసి జాలి పడటం తప్ప ప్రస్తుతానికి చేసేదేముందని చూసే వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles