Coronavirus highest spike in Telangana with 92 cases తెలంగాణలో మరో ఐదుగురి మృతి.. ఒక్కరోజు 92 కేసులు..

Covid 19 update coronavirus highest spike in telangana tally nears 3700 mark

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The death toll due to Covid-19 in Telangana nears 150 with five more persons succumbing to the deadly virus. Five deaths during the last 24 hours ending Monday 9 p.m. pushed the death toll to 142. Telangana became the ninth state in India to record more than 100 deaths due to Covid-19.

తెలంగాణలో మరో ఐదుగురి మృతి.. ఒక్కరోజు 92 కేసులు..

Posted: 06/08/2020 11:59 PM IST
Covid 19 update coronavirus highest spike in telangana tally nears 3700 mark

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళన కలిగిస్తున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు.. ప్రతీ రోజు రాష్ట్రంలో సంభవిస్తుండడం అందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఒక్క రోజులో ఐదు మరణాలు చోటుచేసుకున్న రాష్ట్రంగా కూడా నిలిచింది. ఇదివరకు దేశంలో వందకుపైగా మరణాలు నమోదు చేసుకున్న తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో అటు ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.

ఈ ఏప్రిల్ మాసంలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. గ్రేటఱ్ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకున్నా.. వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా నమోదైన కేసులలోనూ అత్యధిక కేసులు గ్రేటర్ కు పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో పాటు గత వారం రో్జులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా మూడు వేల ఏడు వందల మార్కును అధిగమించాయి, దీంతో దేశంలో మూడు వేలకు పైగా కరోనా కేసుల నమోదు చేసుకున్న 12వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసులతో పాల్చితే ఇవాళ కాస్త తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 3700 మార్కును దాటింది. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో ఐదు మంది కరోనా బారిన పడి అసువుల బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 142కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 92 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 3742 కేసులు నమోదయ్యాయి, ఇక ఇవాళ రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికంగానే సంభవించాయి, ఇవాళ ఏకంగా ఐదుగురు కరోనా బారిన పడి చికిత్స పోందుతూ అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 142కు చేరింది. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 1756 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1743 యాక్టివ్‌ కేసులు వున్నాయని వారంతా గాంధీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles