Contempt Case Against Telangana Health Officials! తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం.. పరీక్షలపై ఫైర్..

Telangana high court angry as govt ignore court orders

Coronavirus In Telangana, Telangana High Court, Public health department, Advocate General, chief Secretary, medical and health department, Supreme Court, Coronavirus tests, PPE, Doctors corona, Hyderabad, Telangana

The Telangana High Court on Monday expressed displeasure over the state government for not implementing its orders. 'If the orders are not being followed, action will be taken against medical and health officials for violating the court's order.

తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం.. పరీక్షలపై ఫైర్..

Posted: 06/09/2020 12:02 AM IST
Telangana high court angry as govt ignore court orders

తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రోన్నత న్యయస్థాన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింంది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ సంచాలకుడిని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. విచారణ జరగాల్సి ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని దీనిపై ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రజల్లో కరోనా ర్యాండమ్‌ టెస్టులు కూడా చేయడం లేదని మండిపడింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఈనెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశించింది.

కరోనా వైరస్‌కు సంబంధించిన గణాంకాలను దాచితే దాని ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా గణాంకాలను ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేయడం లేదన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ మేరకు హైకోర్టు ఈ విధంగా స్పందించింది. కరోనా కేసుల గణాంకాలను పత్రికలు, వెబ్‌సైట్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోందన్న అవగాహన ప్రజల్లో కల్పించాలని పేర్కొంది. వైరస్‌ నివారణ జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనిపై ఈ నెల 18 లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles