Monkeys flee with COVID-19 samples in UP's Meerut వైద్యసిబ్బంది నిర్లక్ష్యం.. కరోనా శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు...

Monkey snatches blood samples of covid 19 patients in meerut

coronavirus, covid-19, lockdown, monkey coronavirus samples, monkey covid samples, meerut monkey, meerut monkey covid sample, Uttar pradesh

In a bizarre incident in Uttar Pradesh’s Meerut, a monkey snatched blood samples of Covid-19 patients from a lab technician of the Meerut Medical College on Friday. The video doing rounds on social media shows, the monkey perched atop a tree and chewing on a white packet on what appears to be a sample.

ITEMVIDEOS: వైద్యసిబ్బంది నిర్లక్ష్యం.. కరోనా శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు...

Posted: 05/29/2020 11:26 PM IST
Monkey snatches blood samples of covid 19 patients in meerut

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు హడలెత్తిపోతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఎక్కడి నుంచి కరోనా మహమ్మారి వస్తుందోనని.. ప్రభుత్వాలే లాక్ డౌన్ ప్రకటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సందర్భంలో.. కొందరు అసుపత్రి పిబ్బంది వహించే నిర్లక్షానికి మొత్తం వైద్య సిబ్బంది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలాంటి అనూహ్యమైన ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. నగరంలో సంచరిస్తున్న ఓ వానరాల గుంపు ఆకస్మికంగా మీరట్ లోని మెడికల్ కాలేజీలోకి వెళ్లి కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను ఎత్తుకెళ్లాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తేు.. మీరట్ వైద్య కళాశాలకు చెందిన ముగ్గురు సిబ్బంది కొవిడ్‌-19 అనుమానితుల నుంచి శాంపిళ్లు తీసుకుని వెళ్తుంతుండగా ఓ కోతుల గుంపు దాడి చేసింది. వారి చేతుల్లోని కరోనా రోగుల రక్త నమూనాలను ఎత్తుకెళ్లాయి. ఇక ఆ శాంపిళ్లను తినే వస్తువులని భావించిన కొతులు చెట్ల మీదుకు వెళ్లివాటిని నోటితో కోరకడం కనిపించింది. శాంపిళ్లను కొరకడంతో కోతులకు కరోనా వైరస్ సోకుతుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు వీటి ద్వారా వైరస్ స్థానికలకు కూడా సోకుతుందని వైద్యులు కలవరం చెందుతున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ శాంపిళ్ల ద్వారా మనుషులకు కూడా కరోనా వ్యాధి సోకుతుందేమోనని స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. వాటి వల్ల కరోనా వైరస్‌ ఎక్కడ సోకుతోందనని భయపడుతున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మెడికల్‌ కళాశాల సూపరింటిండెంట్‌ డాక్టర్‌ ధీరజ్‌ బాల్యన్‌ తెలిపారు. దీనిపై అటవీ అధికారులకు తెలియజేసినా వారు  కోతులను పట్టుకోలేదని తెలిపారు. మరోవైపు శాంపిళ్లను ఎత్తుకెళ్లడంతో అనుమానితుల నుంచి మరోసారి శాంపిళ్లను సేకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles