Chhattisgarh's first CM Ajit Jogi no more చత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత

Ajit jogi ex ias officer who became chhattisgarhs first cm dies at 74

Ajit Jogi, Ajit Jogi dies, Ajit Jogi death, Ajit Jogi no more, Ajit Jogi passes away, Ajit Jogi final rituals, Chhattisgarh, Raman Singh, BJP, Congress, Janata Congress Chhattisgarh Jogi, IAS officer to CM, chhattisgarh, politics

Ajit Jogi, the first chief minister of Chhattisgarh that became a state two decades ago, died in Raipur Friday after a prolonged illness. He was 74. Jogi was admitted to Raipur’s Shree Narayana Hospital earlier this month after he suffered a cardiac arrest, and had been in a critical condition since.

చత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి.. మాజీ ఐఏఎస్ అధికారి అజిత్ జోగి కన్నుమూత

Posted: 05/29/2020 07:17 PM IST
Ajit jogi ex ias officer who became chhattisgarhs first cm dies at 74

ఛత్తీస్ గఢ్‌ తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్ గఢ్‌ వ్యవస్థాపకుడు అజిత్‌ జోగి పరమపదించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంత కాలంగా రాయ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా అజిత్ జోగి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గోరెలాలో జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి అధికార హోదాలో రాష్ట్రప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ మాజీ నేతకు ఘనంగా తుది వీడ్కోలు పలుకనుంది.

ఆయన మరణ వార్తను అజిత్‌ జోగి తనయుడు అమిత్‌ జోగి ట్విటర్లో వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ గోప్ప నాయకుడిని కోల్పోయిందని, తనతో పాటు యావత్ రాష్ట్రం తమ తండ్రిని కోల్పోయిందని ట్వీట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు, చత్తీస్ గడ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన వయస్సు 74 ఏళ్లు. అజిత్ జోగి మరణం పట్ల వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూటిలో సుమారు 30 ఏళ్లు కొనసాగడంలో ఆయనకు కాంగ్రెస్ నేతల మరణం వరకు సత్సంబంధాలు కొనసాగాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తమయ్యింది.

1946 ఏప్రిల్‌ 29న బిలాస్ పూర్ లో జన్మించిన ఆయన.. భోపాల్ లోని మౌలానా అజాద్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తరువాత సివిల్స్ పరీక్షలు రాసీన ఆయన అందులోనూ ఉత్తర్ణుడై ఐపీఎస్‌గా ఎంపికయ్యారు, రాజకీయాలకు ముందు ఆయన మధ్యప్రదేశ్ లోని భోపాల్‌, ఇండోర్‌ జిల్లాలకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2000 సంవత్సరంలో ఛత్తీస్ గఢ్‌ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగిన ఆయన ప్రచారపర్యంలో బిజిగా వుండగా ప్రమాదానికి గురై వీల్ చైర్ కు పరిమితమయ్యారు, ఆ ఎన్నికలలో చత్తీస్ గడ్ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎంపీ ఆయనే. ఇక 2008లో ఆయననే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్‌ పేర్కోన్నా ప్రజలు రమణ్ సింగ్ కు ఓటు వేసి బీజేపిని గెలిపించారు. 2016లో కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ పార్టీని స్థాపించారు. ఆయన మరణం పట్ల చత్తీస్ గడ్ కు చెందిన పలువురు రాజకీయ, జాతీయ ప్రముఖులు కూడా సతీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles