డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధకార్ కేసులో నిజానిజాలు వెలుగు చూడాలంటే కేసు ధర్యాప్తును రాష్ట్ర పోలీసుల దర్యాప్తు చేయరాదని, కేసును సీబిఐకి అప్పగించింది. డాక్టర్ సుధకార్ కేసు వ్యవహరాంలో సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి నిర్ణీత గడువులోపు కేసు దర్యాప్తు చేయాలని.. సీబీఐని ఆదేశించింది. ఈ కేసు వ్యవహారంలో 8 వారాల్లో న్యాయస్థానానికి నివేదిక అందజేయాలని సీబీఐకి న్యాయస్థానం నిర్దేశించింది.
డాక్టర్ సుధాకర్ ఘటన కేసు వ్యవహరాన్ని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం పట్ల ఆయన తల్లి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడికి న్యాయం జరగాలనే తాము కోరుకుంటున్నామని అన్నారు. తన కొడుకు పరువు కాపాడుకోవాలంటే హైకోర్టే తమకు దిక్కుని అమె పేర్కోన్నారు. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన కొడుకుపై జరిగిన దాడి ఘటనలో ఇంత జరిగినా అధికారులెవరూ స్పందించలేదని వెల్లడించారు. ఒక డాక్టరు తన అక్రోశాన్ని వెల్లగక్కితే ప్రభుత్వం ఇలా ప్రతీకారం తీర్చుకుంటుందా.? అని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడి ప్రభుత్వం తమను ప్రశ్నించే గొంతులను నులిమేస్తొందని అమె అందోళన వ్యక్తం చేశారు.
నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అనెస్థీషియన్ గా పనిచేసే డాక్టర్ సుధాకర్ .. ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా గళమెత్తారు. ఆగ్రహించిన ప్రభుత్వం సుధాకర్ ను సస్పెండ్ చేసింది. ఆతర్వాత కొన్ని రోజులకు సుధాకర్ గుండుతో గుర్తుపట్టలేని విధంగా విశాఖలో రోడ్డుపై ప్రత్యక్షమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు సుధాకర్‌ను అరెస్టు చేసే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సుధాకర్‌ను లాఠీతో కొట్టడం, బలవంతంగా ఎత్తుకుని తరలించడం దుమారం రేపింది. సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదంటూ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత హైకోర్టుకు లేఖ రాయడంతో దానిని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం విచారణ చేపట్టింది.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more