ఆంధ్ర్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఇవాళ ఉదయమే ప్రభుత్వ కార్యాలయాలకు, భవనాలకు, పంచాయితీ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేసిన రాష్టోన్నత న్యాయస్థానం ఆ తరువాత కొద్దిసేపటికే డాక్టర్ సుధాకర్ కేసును సీబిఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని అదేశించింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు చెందిన మూడో కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.
కొన్నినెలల కిందట మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.... ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై సస్పెన్షన్ చెల్లదని స్పష్టం చేసింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, సస్పెన్షన్ కాలంలో ఆపివేసిన వేతనాన్ని, ఇతర భత్యాలను కూడా చెల్లించాలని పేర్కొంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు భావించిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏబీ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సెంట్రల్ అడ్మిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్)కు వెళ్లగా, అక్కడ ఆయనకు నిరాశ తప్పలేదు. ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది. దీంతో ఆయన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన సస్పెన్షన్ ను రద్దు చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more