కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 44 లక్షల మంది కరోనా మహమ్మారి ప్రభావానికి గురయ్యారు, యూరోప్, ఉత్తర అమెరికా, దక్షిణ అసియాలకు విస్తరించిన మహమ్మారి ఏకంగా 200లకు పైగా దేశాలను అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక అభివృద్ది చెందిన దేశాలు కరోనాను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇక మందులేని ఈ వైరస్ ను కట్టడి చేయడమెక్కటే మార్గమని అలోచించి చర్యలు తీసుకునే లోపు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కరోనా వైరస్ ఉద్ధృతి ఇప్పట్లో శాంతించేలా కనిపించడంలేదు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద మూడు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. జనవరి 10వ తేదీన చైనాలోని వూహాన్ నగరంలో కరోనా తొలి మరణం సంభవించగా, ఆ సంఖ్య లక్షకు చేరుకునేందుకు ఏకంగా 91 రోజుల సమయం పట్టింది. కాగా లక్ష మరణాలు రెండు లక్షలు చేరేందుకు కేవలం 16 రోజుల వ్యవధి మాత్రమే పట్టింది. దీంతో యావత్ ప్రపంచం అందోళన చెందింది. దేశాలన్నీ తమ పౌరుల అయురారోగ్యాలను పరిరక్షించుకునేందుకు లాక్ డౌన్ విధించాయి. ఇక రెండు లక్షల మరణాల నుంచి మూడు లక్షల మరణాలు నమోదు అయ్యేందుకు 19 రోజులు మాత్రమే పట్టింది. అయితే ఇక్కడ వేగం తగ్గిందని, ఇక మరిన్ని రోజుల్లో వైరస్ ప్రభావం పూర్తిగా సన్నగిల్లుతుందని కూడా శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.
అగ్రరాజ్యంలో గజగజలాడిస్తున్న కోరానా అనేక మంది అమెరికన్ల ఉసురు తీసింది ఈ దేశంలో ఏకంగా 13 లక్షల మందిని కరోనా ప్రభావాన్ని చూపింది. ఇక ఇక్కడ నమోదైన మరణాలు కూడా ప్రపంచంలోనే అత్యధికంగా నమోదయ్యాయి, అగ్రరాజ్యవ్యాప్తంగా ఏకంగా 80,695 మరణాల సంభవించాయి. వైద్యఅరోగ్యంలోనూ అగ్రగామిగా వున్న అగ్రరాజ్యంలోనే అత్యధిక మరణాలు సంభవించడంతో చిన్న దేశాలు, అభివృద్ది చెందుతున్న దేశాలు, అభివృద్దికి అమడదూరంలో వున్న దేశాలు అందోళన చెందుతున్నాయి. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి,
ఇక యూనైటెడ్ కింగ్ డమ్ తో పాటు రష్యాలో మహమ్మారి విజృంభన ఉదృంతంగానే కోనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఏకంగా 2లక్షల 29 వేల మందిపై ప్రభావాన్ని చాటిన కరోనా ఏకంగా 33 వేల మంది ఉసురు తీసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ లో విధించిన లాక్ డౌన్ ను వచ్చె నెల 1 వరకు కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటలీలో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఈ పర్యాటక దేశంలో 2,22,428 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఏకంగా 33 వేల 106 మంది కరోనా సోకడంతో అస్వస్థతకు గురై మరణించారు. స్పెయిన్ దేశంలో ఏకంగా 2,28 వేల మంది కరోనా వైరస్ బారిన పడగా.. అందులో 27104 మంది తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు.
ఫ్రాన్స్ లో 2,28,185 పాజిటివ్ కేసులు, 27,029 మరణాలు నమోదయ్యాయి. ఇక ప్రాన్స్ లో లక్షా 40 వేల మందికి కరోనా సోకింది. ఇక ఆ తరువాత స్థానంలో లాటిన్ అమెరికా వుంది. లాటిన్ అమెరికాలో తాజాగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ దేశంలో ఏకంగా లక్షా 77 వేల మంది కరోనా వ్యాధిగ్రస్తులు నమోదుకాగా, వీరిలో 12,400 మంది మృత్యువాతపడ్డారు. ఆ తరువాత బెల్జియంలో కరోనా తన ఉద్రితిని చాటింది, బెల్జియంలో కరోనా ప్రభావాన పట్టిన వారు తక్కువ సంఖ్యలోనే వున్నా మరణాల నమోదు మాత్రం అధికంగా వుంది. ఏకంగా 8,843 మంది కరోనా ప్రభావంతో మరణించారు. జర్మనీలో 1,72,239 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,723 మరణాలు సంభవించాయి. ఇరాన్ లో లక్షా 12 వేల మంది కరోనా బారిన పడగా, 6783 మంది కరోనా వైరస్ కబళించివేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత తీవ్ర ప్రభావం కలిగిన పదో దేశంలో నమోదైన కెనడాలో 71486 కేసులు నమోదు కాగా, 5209 మంది మరణించారు.
కరోనా వైరస్ తాజా హాట్ స్పాట్ గా లాటిన్ అమెరికా
లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో 13,944 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,02,918కి చేరింది. ఇప్పటివరకు ఒకేరోజు ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అదే సమయంలో బ్రెజిల్ లో ఒక్కరోజులో 844 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 13,993కి పెరిగింది. ఇక అంతకుముందు రోజు 11,385 కేసులు నమోదవ్వగా, 749 మంది కన్నుమూశారు. బ్రెజిల్ లో కరోనా కేసులు రోజురోజుకూ వేల సంఖ్యలో పెరుగుతున్నా, ఆ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారో తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటి నుంచి ఆయన లాక్ డౌన్ పై విముఖుత చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే, అధ్యక్షుడి నిర్ణయాన్ని సావోపాలో గవర్నర్ జావో డోరియా సమర్థించలేదు. మే 31 వరకు ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసర విభాగాలు తప్ప మిగిలిన రంగాలు ముసివేయాలని చెప్పారు. మరోవైపు అమెరికా, బ్రిటన్ లోనూ కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య 14.5 లక్షలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య 86 వేలు దాటింది. ఇక ఇంగ్లాండ్.. యూరోప్ లోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. ఇక్కడ మొత్తం బాధితుల సంఖ్య 2.33 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 33 వేలకు పైగా నమోదైంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది బాధితులు కాగా.. 3 లక్షల మందికిపైగా బలయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more