Red Zone GHMC with Heavy traffic amid corona కరోనా బుసకొడుతున్నా.. రోడ్లపైకి జనం.. ఏదీ అభ్యంతరం..?

Covid 19 update 33 new positive cases in telangana red zone ghmc with heavy traffic

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

State health authorities have reported 33 new coronavirus positive cases and of the total cases nearly 50 percent of the cases record from GHMC region according to Officials, But with Few exception given by the government, vehicles came on to the roads in large number.

కరోనా బుసకొడుతున్నా.. నగరంలో రోడ్లపైకి జనం.. ఏదీ అభ్యంతరం..?

Posted: 05/11/2020 05:54 PM IST
Covid 19 update 33 new positive cases in telangana red zone ghmc with heavy traffic

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణవాసుల్లో అందోళన రేకెత్తుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కాసింత ఊరట పోందుతున్న అధికారుల్లో పెరుగుతున్న కేసులు మళ్లీ టెన్షన్ పెంచుతున్నాయి. గత వారం పది రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేపుతోంది. తాజాగా నిన్న 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక నమోదైన కేసులలో యాభై శాతంపైన కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటంత ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ కిందే పరిగణించింది ప్రభుత్వం. అయితే ఈ ప్రాంతం అన్నింటికీ మూలం కావడంతో ప్రభుత్వ సడలింపులు ఇవ్వడంతో వాటినే సాకుగా చేసుకుని పనివున్నవారు,, లేనివారు అందరూ హైదరాబాద్ నగరంలో పెద్దసంఖ్యలో సంచరిస్తున్నారు, మే 4వ తేది నుంచి క్రమంగా పెరిగిన వాహనాలు.. ఇక ఒకర్ని చూసి మరోకరు.. ఇలా పలువురు మినహాయింపులు తీసుకోవడంతో వాహనాలు రద్దీ పెరిగింది. దీంతో కరోనా వ్యాధి అధికంగా ప్రబులుతున్న నగరంలో ఇన్ని వాహనాల రాకపోకల ద్వారా మళ్లి వ్యాధి తిరగబెడుతుందా.? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రజారవాణా లేకపోవడంతో అందరూ సొంతవాహనాలపైనే రహదారిపైకి వస్తుండగంతో రద్దీ ఇవాళ భారీగా పెరిగింది. లాక్ డౌన్‌ నుంచి పలు రంగాలకు సడలింపులు ఇవ్వడంతో రద్దీ పెరిగింది. హైదరాబాద్‌లోని కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్ లను అధికారులు పునరుద్ధరించారు. ఇటు నగరంలోని సాప్ట్ వేర్ ఉద్యోగులను కూడా 33 శాతం నిష్పత్తితో పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించినా.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన కంపెనీలు ఈ నెలాఖరు వరకు అదే పద్దతికి ఓటేస్తున్నాయి. కాగా ఇప్పటికే పలు కంపెనీలు మాత్రం ఈ ఏడాది వరకు వర్క్ ఫ్రం హోం అందించాయి. ఇక లాక్ డౌన్ తో మూసేవేసిన ఫ్లైఓవర్ల కూడా రద్దీ నేపథ్యంలో పోలీసులు తెరవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఇప్పటికే ప్రభుత్వం ఇనుము, సిమెంట్‌, ఇసుక, కంకర తదితర వస్తువుల విక్రయాలు, సరఫరాకు అనుమతి ఇచ్చింది. వీటిని రవాణా చేసే వాహనాలను ఆపొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నిత్యావసర సరుకులు, స్టీల్, హార్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ ప‌నులకు సంబంధించిన దుకాణాలు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు కూడా పనిచేస్తున్నాయి. రాత్రి 7 గంటల వరకు షాప్ లు నడుస్తాయి. రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా రోడ్లపైకి రావడం చర్చనీయాంశంగా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles