గ్యాస్ లీకేజీ ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఎల్‌జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్‌డీఆర్‌ఎఫ్, నౌకాదళ సిబ్బంది సాయంతో లీకేజీని నియంత్రించినట్లు చెప్పారు. గ్యాస్ లీకేజీ కారణంగా పరిశ్రమ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. పరిసర ప్రాంతాల్లో నీటి పిచికారీ ద్వారా గాల్లో గ్యాస్ ప్రభావాన్ని నియంత్రించినట్లు వివరించారు.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై గోపాలపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 337, 338, 304 కింద కేసులు నమోదు చేసినట్లు గోపాలపట్నం పోలీసులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్ హెచ్ఆర్సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మీడియా కథనాలనే ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఈ ఘటన మానవ తప్పిదంగానో, నిర్లక్ష్యంగానో జరిగినట్టు వెల్లడి కాకపోయినా, ఇది మానవ హక్కులకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనగా కమిషన్ భావిస్తోంది.
"జీవించడం ప్రజల హక్కు. అలాంటి హక్కును కేత్రస్థాయి నుంచి ఉల్లంఘించారు. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తికి భయపడి అందరూ ఇళ్లలో ఉన్న సమయాన ఉరుముల్లేని పిడుగులా ఈ విషవాయువు లీకైంది" అని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఏపీ సీఎస్ ను ఆదేశించింది. వైద్య చికిత్స వివరాలు, సహాయక చర్యల వివరాలు కూడా తమకు నివేదించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ తాలూకు వివరాలు, దర్యాప్తు వివరాలు తమకు తెలియజేయాలంటూ రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది. ఇందుకుగాను నాలుగు వారాల గడువును విధించింది.
జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమ ఎలా ఏర్పాటు చేశారంటూ ఏపీ హైకోర్టు వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను అమికస్ క్యూరీగా నియమించింది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఓ ఘటనను సుమోటోగా స్వీకరించడం అంటే ప్రభుత్వ వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more