Visakhapatnam gas leak| state govt announces Rs 1 crore compensation each to kin of dead

Visakhapatnam gas leak state govt announces rs 1 crore compensation each to kin of dead

lg polymers, lg polymers gas leakage, visakhapatnam lg polymers, visakhapatnam lg polymers gas leak, lg polymers visakhapatnam gas leak, lg polymers vizag gas leak, lg polymers gas leakage, lg polymers gas leakage news, lg polymers gas leakage latest news, lg polymers gas leakage today news, visakhapatnam lg polymers gas leakage news

Chief Minister Jagan Mohan Reddy announced Rs 1 crore compensation each to the kin of the dead besides offering Rs 20,000 each to the owners who have lost their animals. He also promised jobs to people who are victims of the gas leak and the kin of the family of dead.

విష వాయువు మృతుల కుటుంబికులకు రూ. కోటి పరిహారం: వైఎస్ జగన్

Posted: 05/07/2020 03:22 PM IST
Visakhapatnam gas leak state govt announces rs 1 crore compensation each to kin of dead

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి ఇవాళ తెల్లవారుజామునన విడుదలైన రసాయన విషవాయువులు స్థానిక ఐదారు గ్రామప్రజల పాలిట మర్చిపోలేని విషాధాన్ని నింపింది. ఆదమరచి నిద్రిస్తున్న సంస్థ పరిసరాల్లోని గ్రామ ప్రజలను వారికి తెలియకుండానే కొందరిని అనంతవాయువుల్లో కలిపేయగా, మరికొందరిని మాత్రం అసుపత్రుల పాలుచేసింది. తాజాగా అసుపత్రులలో చికిత్స పోందుతున్నమరో ముగ్గరు బాధితులు మరణం చెందడంతో ఈ గ్యాస్ లీక్ ఘటనలో మొత్తంగా 11 మంది మరణించారు. ఇంకా మూడు వందలమందికి పైగా బాధితులు అసుపత్రులలో చికిత్స పోందుతున్నారు. బాధితుల రోదనలతో విశాఖ కేజీహెచ్ లో ఎక్కడ చూసిన బంధువుల రోదనలు మిన్నంటాయి,

విశాఖ ఘటన నేపథ్యంలో నేరుగా విశాఖకు చేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్కడ అధికారులతో ప్రమాదఘటనకు దారి తీసిన వివరాలను అడిగి తెలుసుకన్నారు. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలీమర్స్ లో చోటుచేసుకున్న దుర్ఘటనపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని.. ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీని అదేశించినట్లు తెలిపారు. కమిటీ నిర్ణీత సమయంలో ఘటన జరిగిన తీరుపై అద్యయనం చేసి నివేదిక ఇస్తారని సీఎం చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఒక అంతర్జాతీయ సంస్థ అని అలాంటి సంస్థలో ఇలాంటి దుర్ఘటన జరగడం విస్మయానికి గురిచేస్తోందన్నారు.  

విశాఖలో మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సి చర్యలపై కూడా ఈ కమిటీ పూర్తి నివేదికను సమర్పిస్తుందని అన్నారు. ఆ రిపోర్టు ఆధారంగా ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ విషయంలో అనుసరించాల్సిన తీరుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే పరిశ్రమను విశాఖ నుంచి మరో ప్రాంతానికి తరలిస్తామని సీఎం జగన్‌ వివరించారు. ఘటన జరిగిన వెంటనే సకాలంలో స్పందించి దాదాపు 340 మందికిపైగా స్థానికులను అంబులెన్సుల ద్వారా తరలించిన అధికారులను సీఎం అభినందించారు.

ఇక విశాఖ గ్యాస్‌ లీక్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించనున్నామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. వెంటిలేటర్‌ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. రెండు నుంచి మూడు రోజల పాటు ఆస్పత్రిలో ఉన్నవారికి లక్ష రూపాయలు పరిహారంగా చెల్లిస్తామన్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. 25వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తామని చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం వచ్చేలా చూస్తామని జగన్‌ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles